Home » పవన్ కళ్యాణ్ టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా.. పూనకాలకు డేట్ ఫిక్స్..!

పవన్ కళ్యాణ్ టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా.. పూనకాలకు డేట్ ఫిక్స్..!

by Anji
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా మూవీలో నటించి గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30 మూవీలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు ఎదురుచూసిన తారక్.. స్క్రిప్ట్ అంతా పక్కా అని భావించిన తరువాతనే సినిమా షూటింగ్ షురూ చేసారు. సినిమా షూటింగ్ ను ప్రారంభించడానికి ముందే ఎప్పుడూ లేనివిధంగా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

Advertisement

 

ఈ సినిమాకి రెండు షెడ్యూల్స్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. దీనిపై నందమూరి అభిమానులు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు వారు ఎదురుచూస్తోంది. మరో విషయం కోసం అదే NTR30 టైటిల్, గ్లింప్స్, పర్టిక్యులర్ గా ఇలా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటమే. ఫ్యాన్స్ కి పూనకాలు ఇచ్చే విధంగా ఓ గ్లింప్స్ వీడియోతో పాటు టైటిల్ లేని ఓ లుక్ ని విడుదల చేయడానికి ఎన్టీఆర్ అండ్ టీమ్ రెడీ అయినట్టు సినీ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

కొరటాల శివ ఓపెనింగ్ రోజున చెప్పిన దాని ప్రకారం.. ఎన్టీఆర్ పక్కా మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు. దీంతో అభిమానులు ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. సినీ సర్కిల్స్ లో NTR30 కి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ సినిమాకి దేవర అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ టైటిల్ ని పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమాకి బ్రో అనే టైటిల్ పెడుతున్నట్టు సమాచారం. దీంగో NTR 30 మేకర్స్ తమ సినిమాకి దేవర అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. వాస్తవాలు తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆశ్చర్యకర విషయాన్ని చెప్పిన తల్లి అంజనాదేవి..!

Vaishnav Tej : ‘ఆదికేశవ’గా వైష్ణవ్ తేజ్ ..ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్

Visitors Are Also Reading