Home » పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆశ్చర్యకర విషయాన్ని చెప్పిన తల్లి అంజనాదేవి..!

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆశ్చర్యకర విషయాన్ని చెప్పిన తల్లి అంజనాదేవి..!

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు వరుస సినిమాలతో, మరోవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఏకంగా నాలుగు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ అధినేతగా కీలకంగా రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తే.. జూన్ నెల నుంచి పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయించడం జరుగుతుందని ఇటీవలే ఓ పర్యటనలో ప్రకటించారు పవన్ కళ్యాణ్. 

Advertisement

ఇటీవల పర్యటనలో స్పష్టం చేయడం జరిగింది. ఒక పక్క ఎండలు భయంకరంగా ఉంటున్నా.. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తగ్గకుండా రైతుల బాధలను తెలుసుకోవడానికి ఇటీవల తూర్పుగోదావరిలో పర్యటించారు. ఆ సమయంలో సీఎం అభ్యర్థిపై, పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. మోగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన చిన్న కొడుకు ఎండనక, వాననక తిరుగుతుంటాడు. అసలు ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోడు. కానీ పవన్ కళ్యాణ్ కి చిన్నప్పుడూ ఆస్తమా ఉండేది. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకునే దానిని అని తెలిపారు. ఇప్పుడు కొన్ని కోట్ల మందికి సహాయం చేయాలని భగవంతుడు వాడికి పని పెట్టాడు.

Advertisement

“ఏదో ఒక రోజు కచ్చితంగా పవన్ కళ్యాణ్ తప్పకుండా విజయం సాధిస్తాడు. అన్న నమ్మకం నాకుంది అని అంజనాదేవి చెప్పుకొచ్చారు. ఇక పెద్ద కొడుకు చిరంజీవి మొదటి నుంచి సాయం చేసే గుణముంటుంది. చిన్నప్పుడే స్నేహితులకే సహాయం చేసేవాడు. ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు. అప్పుడు ఎలా ఉన్నాడో మెగాస్టార్ అయ్యాక కూడా అలాగే ఉన్నాడు.. అసలు తేడా ఏం లేదని పేర్కొన్నారు. సురేఖ నాకు కోడలు కాదు.. కూతురు లాంటిది అని చెప్పాలి. నాకు చిన్న జలుబు వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికీ వెళ్దాం అంటది. ఎప్పుడూ నన్ను కనిపెట్టుకొని ఉంటది” అని ఇంటర్వ్యూలో కుటుంబ సభ్యుల గురించి కీలక విషయాలను వెల్లడించారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. సలార్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించిన అదృష్ట శక్తి ఎవరో తెలుసా!

BoyapatiRAPO : దున్నపోతుతో రామ్ ఎంట్రీ అదుర్స్…. మాస్ కు ఫ్యాన్స్ కు జాతరే

Visitors Are Also Reading