Home » తన సినిమా విడుదల కోసం ఆనాటి “ఇందిరా గాంధీ” ప్రభుత్వానితో ఎందుకు NTR గొడవ పడ్డారు ? అసలు కథ ఇదే !

తన సినిమా విడుదల కోసం ఆనాటి “ఇందిరా గాంధీ” ప్రభుత్వానితో ఎందుకు NTR గొడవ పడ్డారు ? అసలు కథ ఇదే !

by Anji
Ad

విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామ‌రావు దాదాపు ఆయ‌న వేయ‌ని పాత్ర లేదేమో అనిపిస్తుంది. పౌరాణిక‌, జాన‌ప‌ద‌, సాంఘిక చిత్రాల్లో అద్భుత‌మైన పాత్ర‌ల్లో న‌టించిన ఘ‌న‌త ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంది. ఎన్టీఆర్ హిట్ చిత్రాల్లో ఒక‌టైన బొబ్బులి పులి సినిమా ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ సంభాష‌ణ‌లు రాస్తున్న స‌మ‌యంలో నిర్మాత వ‌డ్డే ర‌మేష్ ఈ సినిమాకు అన్ని చిత్రాల‌కంటే భిన్నంగా క్లైమాక్స్ ఉండాలి. చ‌రిత్ర‌లో అది మ‌రిచిపోలేని స‌న్నివేశం కావాల‌ని దాస‌రితో చెప్పార‌ట‌. అనుకున్నవిధంగా దాస‌రి అలాగే సినిమాను తీర్చిదిద్దార‌ట‌. ఈ సినిమా డైలాగ్‌లు చాలా అద్భుతంగా వ‌చ్చాయి. తెలుగు సినిమాలో రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ ఏది అన‌గా పంజాతో కొడితే అది పెద్ద‌పులి. డైలాగ్ తో కొడితే అది బొబ్బిలిపులి.

bobbilipuli

Advertisement

సెన్సార్ బోర్డు చైర్మ‌న్ ఎల్వీ ప్ర‌సాద్‌, ఎదురుగా ద‌ర్శ‌కుడు దాస‌రినారాయ‌ణ‌రావు, నిర్మాత కూర్చుని సినిమా చూశారు. అంత‌కు ముందే మ‌ద్రాస్ రీజ‌న‌ల్ క‌మిటీ బొబ్బులి పులి సినిమాను చూసింది. 3వేల అడుగుల క‌ట్స్ చెప్పింది. 3వేల అడుగులు క‌ట్స్ అంటే ఇక సినిమా మిగ‌ల‌దు. ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌లు మిగ‌ల‌వు. సెంట్ర‌ల్ లో ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం ఉంది. ఈ డైలాగ్‌లు అన్నీ ఆమె పాల‌న‌లో చిచ్చుపెట్టేలా ఉన్నాయి. ఇందులో ప్ర‌భుత్వాన్ని తూర్పారా ప‌ట్టేవే ఉన్నాయి. ఇవ‌న్నీ తీసేయాల‌ని మ‌ద్రాస్ రీజ‌న‌ల్ క‌మిటీ సూచించింది. దీని మీద తేల్చుకుందామ‌ని రివైజింగ్ క‌మిటీ వ‌ద్ద‌కు వ‌చ్చారు ద‌ర్శ‌కుడు దాస‌రి, నిర్మాత వ‌డ్డె ర‌మేష్‌. ఎల్వీప్ర‌సాద్ సినిమా చూసి వాళ్ల‌ను పిలిచారు. ఓన్లీ సింగిల్ క‌ట్ ఇస్తున్నాను. క్లైమాక్స్ మొత్తం తీసేయండి అని చెప్పారు. దీంతో దాస‌రి మేము ఢిల్లీలో తేల్చుకుంటామ‌ని చెప్పారు.

Also Read:  మ‌ల్టీప్లెక్స్‌ల‌లో పాప్‌కార్న్ ఎక్కువ ధ‌ర‌కు అమ్మ‌డానికి గ‌ల‌ కార‌ణం చెప్పిన పీవీఆర్ సంస్థ అధినేత‌..!

ఇక ఈ సినిమా ఎలా ప్రారంభం అయిందంటే అప్ప‌టికే ఎన్టీఆర్ పార్టీ స్థాపించాల‌నే బిజీగా ఉన్న స‌మ‌యంలోనే దాస‌రిని పిలిపించి ఒక మంచి సినిమా చేద్దామ‌ని చెప్పాడు ఎన్టీఆర్‌. అలా దాస‌రి బాగా ఆలోచించి ఒక సైనికుడు సెల‌వుల‌కు ఇంటికి వ‌స్తాడని.. అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తాడు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను చూసి నేను ఉండాల్సింది సైన్యంలో కాదు. ఇక్క‌డే అని తిర‌గ‌బ‌డ‌తాడు అని క‌థ చెప్పాడు.  క‌థ‌ చాలా బాగుంది బ్ర‌ద‌ర్ ప్రొసీడ్ అని ఎన్టీఆర్ దాస‌రితో చెప్పాడ‌ట‌. ఇలాంటి క‌థ‌లో ఆడ‌వారికి న‌చ్చే పాయింట్లు ఉండాలి. ప్రియుని బాగు కోసం త‌న ప్రేమ‌ను త్యాగం చేసే ప్రియురాలు. భ‌ర్త బ‌తికే ఉన్నా చ‌నిపోయాడ‌నుకొని బొట్టు తీసేసే భార్య. భార్య చ‌నిపోతుంది. భ‌ర్త కోసం పోలీసులు కాపు కాసి ఉన్నారు. కాటికాప‌రి వేషంలో వ‌చ్చి త‌ల‌కొరివి పెడ‌తారు ఇక చాలు అనుకున్నారు దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇక క్లైమాక్స్ సీన్ మాట‌లు ఫిరంగులా మోగుతాయి.

Advertisement

Also Read:  భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అస్సలు చెయ్యకూడని పూజలు ! తప్పక తెలుసుకోండి !


స‌మాజంలో జ‌రిగే స‌క‌ల స‌మ‌స్య‌ల గురించి ప్ర‌శ్నిస్తూ గ‌ర్జిస్తుంటాడు. ఇక ఇంత‌కంటే ఎక్కువ కూడా గ‌ర్జిస్తే ప్రేక్ష‌కులు త‌ట్టుకోలేర‌ని అంటాడు దాస‌రి. ఇక ఈ సినిమాకు ఎన్టీఆర్ 38 రోజులు డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.50ల‌క్ష‌లు. నిర్మాణ స‌మ‌యం 50 రోజులు. ఇక అంతా రెడీ. కానీ సెన్సార్ అయి విడుద‌ల కావాల్సి ఉంది. ప్ర‌తి క్రైసెస్‌లో కూడా ఒక హీరో ఉంటాడు. ఈ క్రైసెస్‌లో కూడా ఒక హీరో ఉన్నాడు న‌టుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఈ సినిమా సెన్సార్ వివాదంలో ఉంద‌ని తెలియ‌గానే ప్ర‌భాక‌ర్ రెడ్డి రంగంలోకి దిగారు. బొబ్బులిపులి సినిమా బాగుంది అని ఢిల్లీలో మారుమ్రోగాలి అనుకున్నాడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి.


తొలుత తెలుగు, త‌మిళ ఐఏఎస్‌ల‌ను 18 మంది పోగు చేశాడు. వారికి సినిమా చూపించాడు. సినిమా బాగుంది. ఎన్టీఆర్ మ‌హానుభావుడు. ఇక ఈ సినిమాకి క‌ట్స్ ఎందుకు అని అన్నారు అంద‌రూ. ఆ త‌రువాత పీవీ న‌ర‌సింహారావు, పి. వెంక‌ట సుబ్బయ్య‌, జ‌న‌ర‌ల్ కృష్ణారావు, అప్ప‌టి డిప్యూటీ సీఎం జ‌గ‌న్నాథ‌రావు, వీరంద‌రినీ జ‌త చేసి మ‌ళ్లీ షో వేశాడు. మీకెందుకు మేము చూసుకుంటామ‌ని నిర్మాత ర‌మేష్‌కి హామీ ఇచ్చారు. ర‌మేష్‌- ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు క‌లిసి మ‌ద్రాస్‌లో ఉన్న దాస‌రికి ఫోన్‌చేశారు. మీరు వెంట‌నే రండి.. ఇంకొక్క‌రికీ చూపిస్తే మ‌న సినిమా విడుద‌ల‌వుతుంది. ఆయ‌న ఎవ్వ‌రో మ‌న తెలుగువాడు నీలం సంజీవ‌రెడ్డి. ఆయ‌న భార‌త రాష్ట్రప‌తిగా ఉన్నారు.

నీలం సంజీవ‌రెడ్డి ప్ర‌త్యేకంగా రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో బొబ్బులి పులి సినిమా చూశారు. ఇక సెన్సార్ అధికారులు క‌త్తెర లేకుండా జులై 09, 1982న సినిమా విడుద‌లైంది. చాలా చోట్ల రేయింబ‌వ‌ళ్లు షోలు వేశారు. ఈ సినిమా అప్ప‌ట్లో చాలా చోట్ల 175, 100 రోజులు ఆడింది. బొబ్బిలిపులి ఎన్టీఆర్ ని హీరో నుంచి నాయ‌కుడిగా త‌యారుచేసింది. ఈ సినిమా చాలా రికార్డుల‌ను క్రియేట్ చేసింది. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో తొలిసారి 100కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. తొలిరోజే 13ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. తొలి వారంలో 78 ల‌క్ష‌ల‌కు పైగా వ‌సూలు చేసింది. రెండు వారాల్లో కోటికి పైగా వ‌సూలు చేసింది. ఓవ‌రాలుగా 3 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది బొబ్బులి పులి. 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు సుద‌ర్శ‌న్ 35 ఎంఎంలో 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.

Also Read : 

టాలీవుడ్ లో నేపోటిజం గురించి 15 ఏళ్ల క్రిందటే చిరు చెప్పిందే నిజం అయ్యిందా ?

హెలికాప్టర్ ప్రమాదానికి ముందు “సౌందర్య” మాట్లాడిన చివరి మాటలు అవేనా ? ఆ రోజు ఏమైందంటే ?

 

Visitors Are Also Reading