ఈరోజుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుందనే చెప్పాలి. వారానికి 5 రోజులు కష్టపడడం మిగతా రెండు రోజులు తనివి తీరా స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఇందులో భాగంగా ఎక్కువగా సినిమాను థియేటర్లలో చూడడానికి ఇష్టపడుతుంటారు.
Advertisement
Also Read: హృతిక్ రోషన్ పై నెటిజన్లు గరం గరం.. ముందు నీ సినిమా సంగతి చూస్కో..!
కొందరూ అయితే ఆన్‌లైన్‌లలో చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎవరికీ నచ్చిన విధంగా వారు చేస్తుంటారు. మరోవైపు వీకెండ్ దృష్టిలో పెట్టుకుని సినిమాలను కూడా నిర్మాతలు భారీ ఎత్తున విడుదల చేస్తుంటారు. ఇక ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా కానీ మల్టీప్లెక్స్ థియేటర్ ఆవరణలో సినిమా టికెట్ ధరల కంటే క్యాంటిన్‌లో లభించే ఫుడ్ ధరలు వినియోగదారులకు షాక్ కొడుతుంటాయి.
టికెట్ కొన్న తరువాత మల్టీప్లెక్స్ ఆవరణలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, తదితర స్నాక్స్ వంటివి కొనే సమయంలో జేబుకు చిల్లీ పడేవిధంగా ధరలు దర్శనమిస్తుంటాయి. ఈ తరుణంలో చాలా మంది వినియోగదారులు మల్టీప్లెక్స్ ఆవరణలో తినుబండారాలు ధరలు తగ్గించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంపై తాజాగా దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ యజమాన్యంగా పేరుపొందిన పీవీఆర్ చైర్మణ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ స్పందించారు. ప్రధానంగా పాప్ కార్న్ ధరనుద్దేశించి మాట్లాడారు. సినిమా థియేటర్‌లో తినుబండారాల ధరలు వ్యతిరేకిస్తున్న వినియోగదారులను నిందించలేము. భారతదేశంలో సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు ఫుడ్ అండ్ బేవరేజెస్ ఎటువంటి మార్పు ఉండదని బిజ్లీ చెప్పారు.
Advertisement
మల్టీప్లెక్స్ థియేటర్లలో సకల సౌకర్యాలు ఉన్నాయని నిర్వహణ ఖర్చులకోసం ఆ మాత్రం అధిక ధరలు విక్రయిస్తున్నట్టు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ బేవరేజేస్ మార్కెట్ రూ.1500 కోట్లుగా ఉందని.. మల్టీప్లెక్స్ థియేటర్లలో అధిక స్క్రీన్‌లు ఉండడం వల్ల సౌండ్ మరియు ఏసీ స్క్రీన్ ప్రొడక్షన్ అవసరం ఎక్కువ కాబట్టే థియేటర్ ఆవరణలో తినుబండారాలు ధరలు నాలుగు రెట్ల నుంచి ఆరు రెట్లు పెరుగుతాయని వెల్లడించారు. ముఖ్యంగా పెరిగిన వ్యయంతో పాటు సమర్పణ నాణ్యతతో ప్రజలు సంతోషంగా ఉండేవిధంగా కల్పిస్తున్న సౌకర్యాల కారణంగానే సినిమా థియేటర్లలో పాప్‌కార్న్ కూల్ డ్రింక్స్ వంటి ధరలు అధికంగా ఉన్నట్టు పీవీఆర్ బాస్, అజయ్ బిజ్లీ చెప్పుకొచ్చారు.
Also Read :
రైతులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Advertisement
మహానటి సినిమాలో తొలుత అనుకున్న హీరోయిన్ గురించి మీకు తెలుసా..?