Home » హెలికాప్టర్ ప్రమాదానికి ముందు “సౌందర్య” మాట్లాడిన చివరి మాటలు అవేనా ? ఆ రోజు ఏమైందంటే ?

హెలికాప్టర్ ప్రమాదానికి ముందు “సౌందర్య” మాట్లాడిన చివరి మాటలు అవేనా ? ఆ రోజు ఏమైందంటే ?

by Anji
Ad

అందం కూడా అసూయ ప‌డేంత అందం ఆమె సొంతం. అందం, అభిన‌యం రెండు క‌లిసిన మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జూనియ‌ర్‌ సావిత్రిగా చ‌ల‌న చిత్ర‌రంగంలో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంద‌రో అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించారు. చ‌క్కటి అభిన‌యంతో వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ప్ర‌భావితం చేయ‌వ‌చ్చో ఆవిడ మ‌రోసారి నిరూపించారు. 12 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో 120 సినిమాలు చేసి ప్రేక్ష‌కుల మ‌న‌సులో చెక్కు చెద‌ర‌ని గుర్తింపు సంపాదించుకున్నారు సౌంద‌ర్య‌.

ఇవి కూడా చదవండి: లైగ‌ర్ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్.. కీల‌క సీన్లు క‌ట్‌..!

Advertisement

soundarya

 

ముఖ్యంగా సౌంద‌ర్య ఏ పాత్ర‌లోనైనా ఇట్టే ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల‌దు. త‌న అందం, అభిన‌యంతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ప్ర‌శాంతంగా సాగుతున్న‌టువంటి జీవితం ఒక హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంతో పూర్తిగా మారిపోయింది. అందాల తార తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది. ఏప్రిల్ 17, 2004లో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఆమె మ‌నంద‌రినీ విడిచి వెళ్లిపోయారు. అస‌లు ప్ర‌మాదం ఎలా జ‌రిగింది..? ఎక్క‌డికి వెళ్తుంటే ప్ర‌మాదం జ‌రిగింది . ఇది నిజంగా ప్ర‌మాద‌మేనా లేక ఎవ‌రైనా చేశారా అని ర‌క‌ర‌కాల సందేహాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:  బింబిసారలో మొసలి సీన్ కు అంత ఖర్చు అయ్యిందా..?

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2004లో ఎక్క‌డ చూసినా అప్పుడు ఎన్నిక‌ల హ‌డావుడి క‌నిపిస్తుంది. బీజేపీ, టీడీపీ క‌లిసి పోటీ చేస్తున్నాయి. టీఆర్ఎస్‌- కాంగ్రెస్, క‌మ్యూనిస్టు పార్టీలు పొత్తుతో పోటీచేస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల కోసం సినిమా స్టార్స్‌తో ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. క‌రీంన‌గ‌ర్ ఎంపీగా సీ.హెచ్‌.విద్యాసాగ‌ర్ రావు పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌కు మ‌ద్దతుగా సినీ న‌టి సౌంద‌ర్య ప్ర‌చారం చేయాల‌ని అధిష్టానం నిర్ణ‌యించింది. ఇక సౌంద‌ర్య అస‌లు సౌమ్య‌. ఆమె తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డంల‌లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి పేరు సంపాదించుకున్నారు. 2004 ఏప్రిల్ కి ముందే బీజేపీలో చేరారు సౌంద‌ర్య‌. ఏప్రిల్ 14, 2004న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌రీంన‌గ‌ర్ వెళ్లాల‌ని ఆవిడ నిర్ణ‌యించుకున్నారు.

Advertisement

సౌంద‌ర్య ఆమె అన్న‌య్య అమ‌ర్‌నాథ్‌, వ‌దిన నిర్మ‌ల‌, మేన‌కోడ‌లు, త‌న అన్న‌య్య భార్య స్నేహితుడు ర‌మేష్ వీరంద‌రూ క‌లిసి బెంగ‌ళూరు నుంచి జ‌క్కూరు విమానాశ్ర‌యం వ‌ద్ద‌కు బ‌య‌లుదేరారు. వీరు స‌ర‌దాగా మాట్లాడుకుంటూ వ‌స్తున్నారు. అలా మాట్లాడుకుంటూ వారు చేరుకోవాల్సిన గ‌మ్య‌స్థానం రానే వ‌చ్చింది. విమానాశ్ర‌యం వ‌ద్ద కారు దిగి వెళ్లి వ‌స్తాన‌ని అంద‌రికీ చెప్పింది. త‌న ద‌గ్గ‌ర ఉన్న మేన కోడ‌లిని త‌న వ‌దిన నిర్మ‌ల‌కి అప్ప‌గించింది. అమ‌ర్‌నాథ్‌, ర‌మేష్ హెలికాప్ట‌ర్ ఎక్కారు. సౌంద‌ర్య వెన‌క్కి తిరిగి వ‌దిన‌, మేన‌కోడ‌లుకి టాటా చెబుతూ హెలికాప్ట‌ర్ ఎక్కారు. హెలికాప్ట‌ర్ ఎక్క‌గానే పైలెట్ అంద‌రినీ సీట్ బెల్ట్ పెట్టుకోమ‌ని చెప్పారు. నెమ్మ‌ది నెమ్మ‌దిగా హెలికాప్ట‌ర్ క‌దులుతూ వెళ్లింది. ర‌న్ వే మీది నుంచి హెలికాప్ట‌ర్ గాలిలోకి లేచిన మూడు నిమిషాల్లోనే పెద్ద శ‌బ్దంతో నేల‌పై ప‌డింది. అస‌లు ఏం జ‌రిగిందో అక్క‌డ ఉన్న‌వారెవ్వ‌రికీ అర్థం కాలేదు. ఇక హెలికాప్ట‌ర్ నుంచి కాపాడండి అర్థ‌నాతాలు వినిపిస్తున్నాయి.

విమాన‌యాన సిబ్బంది కాపాడ‌డానికి ప‌రుగులు తీశారు. అప్ప‌టికే హెలికాప్ట‌ర్ లోంచి మంట‌లు చెల‌రేగాయి. సాయం చేద్దామ‌ని వెళ్లిన సిబ్బంది కూడా చెల్ల చెదురుగా ప‌డిపోయారు. వారికి తీవ్ర‌మైన గాయాల‌య్యాయి. పై నుంచి హెలికాప్ట‌ర్ కింద ప‌డ‌డంతో 5 అడుగుల లోతు వ‌ర‌కు కూరుకుపోయింది. ఈ ప్ర‌మాదంలో హెలికాప్ట‌ర్ లో ఉన్న న‌లుగురి మృత‌దేహాలు హెలికాప్ట‌ర్‌లోని కొన్ని బాగాల‌కు అత‌క్కుపోయాయి. ఈ ప్ర‌మాదం జ‌రిగిన 30 నిమిషాల త‌రువాత మంట‌ల‌ను ఆర్పారు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన ప్ర‌మాద‌మంతా జ‌రిగిపోయింది. నాలుగు ప్రాణాలు గాలిలో క‌లిసిపోయాయి. త‌మ కండ్ల ఎదురుగా ఇంత ప్ర‌మాదం జ‌రిగినా చూస్తున్న వారు మాత్రం ఏమి చేయ‌లేక‌పోయారు.

Soundarya
వెళ్లొస్తాన‌ని చెప్పి వెళ్లిన భ‌ర్త క‌ళ్ల ముందే అగ్నికి ఆహుతి అవ్వ‌డం చూసి అమ‌ర్‌నాథ్ భార్య త‌ల్ల‌డిల్లిపోయింది. ఫోన్ ఆధారంగా సౌంద‌ర్య మృత‌దేహాన్ని, చెప్పు ఆధారంగా ఆమె అన్న అమ‌ర్‌నాథ్ మృత‌దేహాన్ని గుర్తించారు. మిగ‌తా ఇద్ద‌రూ మృత‌దేహాలను డీఎన్ఏ ప‌రీక్ష ఆధారంగా గుర్తించారు. ఆమె అంత్య‌క్రియ‌ల‌కు పెద్ద ఎత్తున అభిమానులు త‌ర‌లివెళ్లారు. బెంగ‌ళూరులోని రాజాజీఘాట్‌లో రాత్రి 8 గంట‌ల‌కు సౌంద‌ర్య అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. 2003లో సౌంద‌ర్య సాప్ట్‌వేర్ ఇంజినీర్ ని పెళ్లి చేసుకున్నారు. వివాహం జ‌రిగి సంవ‌త్స‌రం కూడా గ‌డ‌వ‌క ముందే సౌంద‌ర్య మ‌ర‌ణించారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం ద్వారా ఒక అందాల తార మ‌న‌కు దూర‌మైంద‌నే చెప్ప‌వ‌చ్చు.

Also Read :  29 రోజుల్లో సినిమాని తీసి, 500 రోజులు ఏకధాటిగా ఆడిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా ?

టాలీవుడ్ లో నేపోటిజం గురించి 15 ఏళ్ల క్రిందటే చిరు చెప్పిందే నిజం అయ్యిందా ?

 

Visitors Are Also Reading