Home » Happy days మూవీలో నిఖిల్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..!!

Happy days మూవీలో నిఖిల్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హ్యాపీడేస్ సినిమా ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. స్టూడెంట్ బేసిక్ లో వచ్చిన ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ అప్పట్లో ఇంజనీరింగ్ లో చేరాలనె ఆతృత కలిగింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సరికొత్తగా రూపొందిన ఈ మూవీ అప్పట్లో సంచలమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ గా చూపించారు డైరెక్టర్. ఈ చిత్రం ద్వారానే వరుణ్ సందేశ్, సిద్ధార్థ నిఖిల్, తమన్నా వంటి వారు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Advertisement

ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ రెండు సినిమాలు భారీ హిట్లు కొట్టి, తర్వాత వరుస ప్లాప్ ల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు ఇక నిఖిల్ సిద్ధార్థ్ మాత్రం బలమైన స్టోరీలను ఎంపిక చేస్తూ ప్రత్యేకమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకుంటున్నారు. ఇక హీరోయిన్ తమన్నా గురించి చెప్పనవసరం లేదు. ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. ఈ చిత్రం చాలామందిని అట్రాక్ట్ చేసిన పాత్ర రాజేష్ పాత్ర.

Advertisement

ఈ పాత్రని నిఖిల్ సిద్ధార్థ్ బాగా చేశారు. అయితే శేఖర్ కమ్ముల ఈ క్యారెక్టర్ ని ముందుగా హీరో నితిన్ తో చేద్దామని అనుకున్నారట. కానీ అప్పటికే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు నితిన్. సినిమాలు అందరూ కొత్తవాళ్లే కాబట్టి వాళ్ల మధ్యలో నేనెందుకు అని ఆయన వద్దన్నారట. దీంతో ఈ పాత్ర కాస్త నిఖిల్ సిద్ధార్థ్ కి వెళ్ళింది. ఈ సినిమా భారీ హిట్ అవడంతో ఇందులో చేసిన నటీనటులందరికీ ఇండస్ట్రీలో మంచి కెరియర్ దొరికింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading