Home » 16 ఏళ్లుగా ఆహారం లేదు.. కేవలం పెప్సీ తాగి బతికేస్తున్నాడు.. ఎక్కడంటే..?

16 ఏళ్లుగా ఆహారం లేదు.. కేవలం పెప్సీ తాగి బతికేస్తున్నాడు.. ఎక్కడంటే..?

by Sravanthi Pandrala Pandrala

మనం అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు విని కాస్త ఆశ్చర్యపోతూ ఉంటాం. అయితే కొంతమంది వ్యక్తుల ఆహార అలవాట్లు ఇతర అలవాట్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఆహార విషయంలో ఎవరి అలవాట్లు వారికి ఆ విధంగా ఉంటాయి. అలవాటు ఏ విధంగా ఉన్నా ఏదో ఒక ఆహారం అయితే తింటూ ఉంటాం. తినకపోతే బతకడం కష్టం. కానీ ఈ వ్యక్తి 16 సంవత్సరాలుగా ఆహారం తినకుండా ఉంటున్నారట. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. ఇరాన్ కి చెందిన ఘోలమ్రేజా అర్దెషిరి జూన్ 2006 నుంచి ఆహారం తినడం మానేసాడట. దీనికి ఆయన కు ఏమీ ప్రమాదం లేదట. ఎందుకో ఆయన ఆకస్మాత్తుగా తినడం మానేసి వింత అనుభూతిని అనుభవిస్తున్నానని అంటున్నారట. ఏదో తెలియని సమస్య ఆయన ను వేధిస్తోందని చెబుతున్నారు.

అయితే తన నోటిలో ఏదో వెంట్రుకలాంటి వస్తువు ఉన్న ఫీలింగ్ వస్తుందట. తల భాగం తన గొంతులోను మిగతా భాగం పొట్టలో ఉండి అడ్డుపడి ఊపిరాడినట్లు అనిపిస్తోందట. ఈ బాధను ఎవరికీ చెప్పలేకపోతున్నానని అంటున్నారు. ఈ విషయమై ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాడు కానీ ఎవరు తన సమస్యను క్లియర్ చేయలేకపోయారట. అయితే తాను అలసిపోయినప్పుడు పెప్సీ వంటి శీతల పానీయాన్ని తాగుతుంటారట. ముఖ్యంగా రోజుకి మూడు లీటర్ల పెప్సీ డ్రింక్ తాగుతూ ఒక్కో రోజు కేవలం రాత్రిలో నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

 

అంతేకాకుండా అర్దెషిరి 16 సంవత్సరాలుగా కేవలం పెప్సీ పైనే బతుకుతున్నాడు. కనీసం ఇంకే ఆహార పదార్థం కూడా తినడం లేదట. అతని జీవనోపాధి ఫైబర్ గ్లాసులు రిపేర్ చేయడం వంటి పనులు చేస్తారట. అయితే అతని ముందు వారి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా భోజనం చేయరట. ఎందుకంటే తన ముందు ఎవరైనా భోజనం చేస్తుంటే వికారంగా ఉంటుందని అందుకే ఆయన ముందు ఎవరు కూడా భోజనం చేయరని ఆయన చెబుతున్నారు. ఆయనకున్న ఈ వింత అనుభూతి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోవడం సైన్స్ కు కూడా అంతు పట్టడం లేదు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading