Home » రవితేజ అంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి నాటికి ఆమె వయస్సు ఎంతంటే.. ?

రవితేజ అంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి నాటికి ఆమె వయస్సు ఎంతంటే.. ?

by Anji
Ad

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో ముందు వరుసలో ఉంటారు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ. వీరు చాలా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకొని స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక రవితేజ విషయానికొస్తే.. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే కళ్యాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమె వయస్సులో రవితేజ కంటే చాలా చిన్నదట. రవితేజ కంటే ఆమె వయస్సులో ఎంత చిన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

హీరోగా కాకముందు తొలుత రవితేజ నిన్నేపెళ్లాడతా సినిమాకి డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఇక ఆ తరువాత సింధూరం మూవీతో మంచి గుర్తింపు సంపాదించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఏదైనా సినిమా హిట్ సాధిస్తేనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట రవితేజ. సింధూరంలో సెకండ్ హీరోగా నటించాడు రవితేజ. దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన నీకోసం సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు రవితేజ. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ తరువాత సముద్రం, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా, అన్నయ్య, బడ్జెట్ పద్మనాభం, చిరంజీవిలు వంటి సినిమాల్లో సెకండ్, థర్డ్ హీరోగా నటించాడు. ఇదే సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ రవితేజ ప్రతిభను గుర్తించి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీ రవితేజ సినీ కెరీర్ లోనే ఫస్ట్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 

Advertisement


ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో రవితేజ ఆ తరువాత పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. రవితేజ తల్లికి మేనమామ కూతురు అయితేనే సెట్ అవుతుందని భావించిందట.  రవితేజకి అయితేనే తమ కోడలు  బాగా సెట్ అవుతుందని భావించిన రవితేజ తల్లి కళ్యాణి తల్లిదండ్రులతో మాట్లాడి ఈ సంబంధం సెట్ చేశారు. కానీ రవితేజ కంటే కూడా వయస్సులో కళ్యాణి దాదాపు 13 సంవత్సరాలు చిన్నది అట.   2002 మే 26న రవితేజ, కళ్యాణిల  వివాహం జరిగింది. ప్రస్తుతం రవితేజ వయస్సు 55 కాగా.. కళ్యాణి వయస్సు 42 సంవత్సరాలు. వీరికి ఇద్దరూ పిల్లలు ఒక కుమారుడు, ఒక కూతురు కలరు.  వీరి పెళ్లి తరువాత ఇండియట్ సినిమాలో నటించిన రవితేజ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు రవితేజ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో అరుదైన సంఘటన..భర్త లేకుండా నిహారిక, భార్య లేకుండా పవన్ ?

విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఓటీటీ ఫార్ట్ నర్ లాక్.. అన్ని కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుందా ?

 

Visitors Are Also Reading