Home » 47 ఏళ్లుగా మా కోసమే ఉంటున్నాడు.. ఉద్యోగి రామాచారి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు..!

47 ఏళ్లుగా మా కోసమే ఉంటున్నాడు.. ఉద్యోగి రామాచారి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలించిన తరువాత ఇక్కడ సినిమా వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని 1975లో పునాది రాయి పడింది. ఇక్కడ మన తెలుగు సినిమాకు పునాదిరాయిగా అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన జరిగింది. అది పూర్తయిన తరువాత అక్కడే ఎన్నో సినిమాలకు చెందిన పనులు జరిగేవి. నేటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ స్టూడియోలో ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

Advertisement

అధునాతన సాంకేతికకు ఫిలీం స్కూల్ వంటి ఏర్పాట్లకు అంకురార్పణ చేసిన స్టూడియో ఇది. ఔట్ డోర్ సెట్, ఇన్ డోర్ అంతస్తులు, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్ తదితర సేవలను ఈ స్టూడియో అందిస్తోంది. ఈ స్టూడియో ఈ రేంజ్ కి చేరుకోవడానికి ప్రధాన కారణం నాగార్జనతో పాటు అమల, సుప్రియ అనే చెప్పవచ్చు. సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దాదాపు 47 ఏళ్లుగా తమ వద్దే అన్నపూర్ణ అకౌంటెంట్ గా పని చేస్తున్న రామాచారి అనే ఉద్యోగి గురించి నాగార్జున స్పెషల్ గా చెబుతూ అన్నపూర్ణ స్టూడియో పేరుతో ఓ వీడియో విడుదల చేశారు.

Advertisement

1976లో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించారు. అప్పట్లో నాగేశ్వరరావు వద్ద చేరిన మొదటి ఉద్యోగి రామాచారినే. 47 ఏళ్లుగా మా వద్ద నిజాయితీగా పని చేస్తున్నారని చెప్పడం కంటే మా ఇంట్లో మనిషిలా చేరియపోయాడని చెప్పడం కరెక్ట్. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు వచ్చినా ఇంకా అదే యాక్టివ్ గా పని చేస్తారు. మా డబ్బులు అన్ని ఇనపెట్టేలో పెట్టి దాని తాళం ఆయన ఇచ్చేసి హ్యాపీగా ఉండవచ్చని నాగార్జున చెప్పారు. మరోవైపు ఉద్యోగి రామాచారి  మాట్లాడుతూ.. ఇక్కడ పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కినేని వారు తనను సొంత కుటుంబ సభ్యుడి మాదిరిగానే చూసుకుంటారు. ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సహాయం చేయడమే కాకుండా ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు నాగార్జున ముందుంటారు. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగికి ఇంత ప్రత్యేకతను ఇచ్చిన నాగార్జునను సోషల్ మీడియాలో పలువురు అభినందిస్తున్నారు. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !   తెలుగు న్యూస్  కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading