Home » నాగార్జున “సూప‌ర్” సినిమా హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా.?

నాగార్జున “సూప‌ర్” సినిమా హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా.?

by AJAY
Ad

నాగార్జున కెరీర్ బెస్ట్ సినిమాల‌లో సూప‌ర్ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో నాగార్జున స్టైలిష్ లుక్ లో క‌నిపించి అద‌ర‌గొట్టారు. ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ అనుష్క ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఇక ఈ సినిమాలో సోనూసూద్ నాగార్జున‌కు మిత్రుడుగా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. అంతే కాకుండా ఈ సినిమాలో అయేషా ట‌కియా హీరోయిన్ గా న‌టించింది. ఈ ముద్దుగుమ్మ కూడా సూప‌ర్ సినిమాతోనే టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

Advertisement

అంతే కాకుండా మొద‌టి సినిమాతోనే కుర్రాళ్ల మ‌న‌సును దోచుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందే ఆయేషా ట‌కియా బాలీవుడ్ లో సినిమాలు చేసింది. బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన వాంటెడ్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ లో క్యాష్, పాఠ‌శాల తో పాటూ మ‌రిన్ని సినిమాల‌లో న‌టించి అల‌రించింది.

ALSO READ : షారూఖ్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్.. ఆ పాత్రలో ?

Advertisement

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే ఆయేషా పెళ్లి చేసుకుంది. స‌మాజ్ వాద్ పార్టీ నేత మ‌రియు వ్యాపార‌వేత్త అయిన ఫ‌ర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లికి ముందు వీరిద్ద‌రూ ప్రేమించుకున్నారు. 2005 నుండి ప్రేమించుకున్న వీరు 2009లో ఒక్క‌ట‌య్యారు. ఇక పెళ్లి త‌ర‌వాత ఓ బాబుకు ఆయేషా జ‌న్మ‌నిచ్చింది. అంతే కాకుండా పెళ్లి త‌ర‌వాత ఆయేషా సినిమాలకు దూరంగా ఉంది. కాగా ఆయేషా త‌న భ‌ర్త మ‌తంలోకి మార‌డంతో ఆమెపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ALSO READ : షారూఖ్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్.. ఆ పాత్రలో ?

కొంత‌మంది ఆమెను చంపుతామ‌ని సైతం బెదిరింపుల‌కు పాల్ప‌డటం సంచ‌ల‌నం గా మారింది. ఆ త‌ర‌వాత ఆమెకు పోలీసులు ప్రెటెక్ష‌న్ ఇచ్చారు. ఇక ప్ర‌స్తుతం ఆయేషా ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దాంతో సూప‌ర్ సినిమా హీరోయిన్ ఇంత‌లా మారిపోయిందా అని నెటిజ‌న్ లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ALSO READ : సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిల్ విషయంలో అంత జరిగిందా..?

Visitors Are Also Reading