Home » షారూఖ్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్.. ఆ పాత్రలో ?

షారూఖ్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్.. ఆ పాత్రలో ?

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా మారిపోయాడు. తనతో సినిమా చేయాలని దర్శక, నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. తనకు ఉన్న ఫాలోయింగ్ కి కొందరూ దర్శకులు వాళ్ల సినిమాలకు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పలువురు స్టార్ హీరోల ట్రైలర్ ని రామ్ చరణ్ చే విడుదల చేయించి సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ తెలుగు ట్రైలర్ ని కూడా రామ్ చరణ్ తోనే విడుదల చేయించారు.

Also Read :  చత్రపతి విలన్ భార్యను ఎప్పుడైనా చూసారా..? స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు…!

Advertisement

తాజాగా షారూఖ్ ఖాన్ కొత్త సినిమాలో రామ్ చరణ్ ఓ గెస్ట్ రోల్ చేయించడానికి మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీతో జవాన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర ఉంది. ఆ పాత్రని తమిళంలో విజయ్ చేస్తున్నాడు. తెలుగులో రామ్ చరణ్ తో చేయించడానికి దర్శకుడుప్రయత్నిస్తున్నాడట. చరణ్ ప్రస్తుతం RRR ప్రమోషన్స్ లో అమెరికాలో ఉన్న చరణ్ ఇండియాకి తిరిగి రాగానే కలిసి ఈ పాత్ర గురించి నేరేట్ చేయనున్నాడట అట్లీ.

Advertisement

Also Read :  మీ ఆశీస్సుల‌తోనే మౌనిక‌తో పెళ్లి…మొద‌టిసారి స్పందించిన మ‌నోజ్..!

గతంలో ఈ పాత్రను తెలుగులో అల్లు అర్జున్ చేయబోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి. ఇక అల్లు అర్జున్ స్థానంలో రామ్ చరణ్ తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. మూవీ మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ RC15లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈనెల చివరి వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్టు కియారా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని ప్రకటించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి.

Also Read :   నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..!

Visitors Are Also Reading