Home » సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిల్ విషయంలో అంత జరిగిందా..?

సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిల్ విషయంలో అంత జరిగిందా..?

by Anji

సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఈయన ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా రాణించినటువంటి మల్టీటాలెంటేడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేశారు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, హీరోగా ఆయన అన్ని రంగాల్లో రాణించారు. ఇక ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. అటు ఫ్యామిలీ, ఇటు మాస్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు ఎస్వీ కృష్ణారెడ్డి. సూపర్ స్టార్ కృష్ణతో ఆయన చాలా సినిమాలను చేశారు. వేరే హీరోలతో సినిమాలు చేసినప్పటికీ అందులో ఒక పాట కృష్ణ గారితో చేయించే వారు దర్శకుడు కృష్ణారెడ్డి.

Also Read :   ఈ 15 మంది టాలీవుడ్ దర్శకులు.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసే వారో తెలుసా ?

ఎస్వీ కృష్ణారెడ్డి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చేసిన సినిమాలలో నెంబర్ వన్ చిత్రం ఒకటి. గతంలో ఈ సినిమా దర్శకుడు కృష్ణారెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా గురించి కృష్ణని సంప్రదించినప్పుడు ఆయనకు కేవలం ఒకే ఒక్క సీన్ చెప్పారట. అయితే బాగుంది చేసేద్దాం అన్నారట కృష్ణ. మిగిలిన కథ రెడీగా ఉందా అని అడిగితే కూడా లేదు. మీకు తగిన విధంగా కథను సిద్ధం చేస్తాను అని చెప్పినట్టు వెల్లడించారు. దీంతో కృష్ణ కూడా ఈ సినిమా మంచి హిట్ అవుతుందనుకున్నారట. ఆ ఒక్క సీన్ చాలు ఈ సినిమా హిట్ అవ్వడానికి పూర్తి కథ సిద్ధం చేసుకో అని ఎస్వీ కృష్ణారెడ్డికి చెప్పారట కృష్ణ.

Also Read :  షారూఖ్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్.. ఆ పాత్రలో ?

అదేవిధంగా ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు ఎదురయ్యాయట. సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోలు చాాలా మంది ఉన్నారు. కృష్ణ గారికే ఆ టైటిల్ పెట్టడం పై చాలా మంది తనను ప్రశ్నించారు. కానీ ఆ సినిమా కథ ప్రకారం.. అదే టైటిల్ కరెక్ట్ గా ఉంటుందని.. ఆ సినిమాలో కుటుంబ బాధ్యతలు తీసుకునే కొడుకే నెంబర్ వన్. అలా ఆ సినిమాకి నెంబర్ వన్ అని టైటిట్ పెట్టినట్టు క్లారిటీ ఇచ్చారు దర్శకుడు కృష్ణారెడ్డి. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

Also Read :   మీ ఆశీస్సుల‌తోనే మౌనిక‌తో పెళ్లి…మొద‌టిసారి స్పందించిన మ‌నోజ్..!

Visitors Are Also Reading