Home » Big Boss Season 7: బిగ్ బాస్ లోకి మొగలిరేకులు సీరియల్ హీరో ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే ?

Big Boss Season 7: బిగ్ బాస్ లోకి మొగలిరేకులు సీరియల్ హీరో ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే ?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. అయితే.. ప్రతి సారీ ఈ సీజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. తాజాగా.. బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతోంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

అయితే.. సీజన్ 6 లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా.. కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు తెలిసినవారే. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ లిస్ట్ లో మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ సీరియల్ తో పాపులర్ అయిన సాగర్ సినిమాల్లో అంతగా క్లిక్ కాలేదు. ఈయన మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయనకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చినదని తెలుస్తోంది. అయితే.. ఈయన రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉండబోతోంది. ఒక్క వారం రోజులకే లక్షలలో రెమ్యునరేషన్ ఉండబోతోందని సమాచారం. మొగలిరేకులు ఫేమ్ సాగర్ గురించి వస్తున్నా ఈ వార్తలలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

మరిన్ని..

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

Visitors Are Also Reading