Home » ‘చమ్కీల అంగిలేసి’ పాట పాడిన ఈ సింగర్ గురించి తెలుసా…!

‘చమ్కీల అంగిలేసి’ పాట పాడిన ఈ సింగర్ గురించి తెలుసా…!

by Bunty
Ad

 

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దసరా మూవీ మేనియా కొనసాగుతుంది. దసరా మూవీ ట్రైలర్ సృష్టించిన బీభత్సం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రియాలిస్టిక్ విధానంతో సినిమా తీశారు. ట్రైలర్ అద్భుతంగా కట్ చేశారు. ఈ చిత్రం పక్క మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నాని బీస్ట్ మోడ్ కూడా మామూలుగా లేదు.

read also : NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

Advertisement

 

మార్చి 30న దసరా చిత్రం విడుదల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ దేశ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో చమ్కిల అంగిలేసి అనే పాట బాగా వైరల్ గా మారడంతో, ఈ పాట పాడిన సింగర్స్ ఎవరు అని సోషల్ మీడియాలో బాగా వెతుకుతున్నారు. అయితే ఈ పాట పాడిన వారిలో మేల్ సింగర్ రామ్ మిరియాల మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఇక ఫిమేల్ సింగర్ విషయానికి వస్తే ఈ పాట పాడిన అమ్మాయి పేరు దీక్షిత అలియాస్ దీ చాలా రోజులుగా పాట పాడుతున్నప్పటికీ దీక్షితకు తెలుగులో ఈ రేంజ్ లో ఒక పాట వైరల్ కావడం ఇదే మొదటిసారి.

Advertisement

read also : RRR సినిమాలో ఎన్టీఆర్ ది ఓ సైడ్ పాత్ర – వేణు స్వామి సంచలనం

Chamkila Angesi' song of the year : సాంగ్ ఆఫ్ ది ఇయర్.. 'దసరా' ఫోక్ మెలోడి అదిరింది!

మొన్నటికి మొన్న హీరో సూర్య నటించిన ఆకాశమే హద్దురా అనే చిత్రంలో సైతం కాటుక కనులే అనే పాట పాడింది దీక్షిత. ఈ పాట ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. సంచలన రికార్డులు నమోదు చేసిన రౌడీ బేబీ పాట కూడా దీక్షిత పాడింది కావడం విశేషం. అలాగే దీక్షిత తన 14వ ఏట నుంచి పాటలు పాడడం ప్రారంభించింది. సంచలన సంగీత దర్శకుడు అయిన సంతోష్ నారాయణ కూతురే ఈ సింగర్ దీక్షిత. దసరా సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. కాబట్టి తన కూతురితో ఒక పాట పాడించారు.

Visitors Are Also Reading