Telugu News » Blog » రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

by Bunty
Published: Last Updated on
Ads

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ సినిమాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా ధమాకా నిలిచింది. రవితేజకు సూపర్ డూపర్ కమర్షియల్ సక్సెస్ అందించింది.

Advertisement

READ ALSO : ‘చమ్కీల అంగిలేసి’ పాట పాడిన ఈ సింగర్ గురించి తెలుసా…!

Advertisement

 

వీకెండ్ తర్వాత కూడా బాక్సాఫీస్ బరిలో సినిమా దూకుడు తగ్గలేదు. రవితేజ సరసన శ్రీ లీల కథానాయికగా నటించిన ధమాకా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బంపర్ హిట్ కొట్టి ఇప్పుడు ఓటీటీలోను దుమ్ము లేపుతోంది. ఇక తాజాగా శృతిహాసన్ బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో హీరో చిరంజీవికి జోడిగా నటించారు. ఇక ఇదే సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు.

READ ALSO :    NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

We can't wait to show you Krack: Shruti Haasan | Telugu Movie News - Times of India

మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఏసీపి విక్రమ్ సాగర్ గా రవితేజ హీరో చిరంజీవికి సవతి సోదరుడిగా కనిపించనున్నారు. అయితే హీరోయిన్ శృతిహాసన్ హీరో రవితేజకు క్రాక్ సినిమాలో భార్యగా నటించిన సంగతి తెలిసిందే. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో శృతిహాసన్ రవితేజకు వదిన పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

READ ALSO : RRR సినిమాలో ఎన్టీఆర్ ది ఓ సైడ్ పాత్ర – వేణు స్వామి సంచలనం