Home » క్రేజీగా `మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి` టీజర్‌.. కామెడీ టైమింగ్‌ అదుర్స్‌

క్రేజీగా `మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి` టీజర్‌.. కామెడీ టైమింగ్‌ అదుర్స్‌

by Bunty
Ad

టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ముందుగా చెప్పినట్టుగానే అదిరిపోయే లుక్ తో సినిమా అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమాకు Miss. శెట్టి Mr. పోలిశెట్టి టైటిల్ ఫైనల్ చేశారు.

READ ALSO : పవన్‌ కళ్యాణ్‌ జాగ్రత్త.. రజనీకాంత్‌ను రంగంలోకి దింపారు: కొడాలి నాని

Advertisement

టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. కామెడీ, ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు పి డైరెక్టర్ చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి 20 ఏళ్ల యువకుడి పాత్రలో కనిపించనుండగా, 40ఏళ్ల మహిళగా అనుష్క నటించనుంది. కాగా, తాజాగా మేకర్స్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ తోనే సినిమాపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్.

Advertisement

READ ALSO : రజనీకాంత్ వాఖ్యాలతో NTR ఆత్మ ఘోషిస్తోంది – రోజా

ఒక చెఫ్ కు, స్టాండప్ కమెడియన్ కు మధ్య సాగే కథ ఇదని ముందు నుంచి మేకర్స్ చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇక టీజర్ లో కూడా అదే చూపించారు. అయితే జీవితంలో పెళ్లి వద్దనుకునే అనుష్క, నవీన్ తో ఎలా ప్రేమలో పడింది? వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు సాగుతుందా? స్టాండప్ కమెడియన్ గా రాణించాలనుకునే నవీన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఇలా ఎన్నో అంశాలకు ఈ టీజర్ తెరలేపింది.

READ ALSO : శ్రీముఖి నడుము చూడడానికి రెడీ అయిపోయిన చిరంజీవి?

Visitors Are Also Reading