Home » పవన్‌ కళ్యాణ్‌ జాగ్రత్త.. రజనీకాంత్‌ను రంగంలోకి దింపారు: కొడాలి నాని

పవన్‌ కళ్యాణ్‌ జాగ్రత్త.. రజనీకాంత్‌ను రంగంలోకి దింపారు: కొడాలి నాని

by Bunty
Ad

సూపర్ స్టార్ రజనీకాంత్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే… రజినీకాంత్ ను, చంద్రబాబు రంగంలోకి దించాడని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కళ్యాణ్ గ్రహించాలని కోరారు.

READ ALSO : రజనీకాంత్ వాఖ్యాలతో NTR ఆత్మ ఘోషిస్తోంది – రోజా

Advertisement

ఎన్టీఆర్ పై చెప్పులు విసుగుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు పెళ్లి తెలిపిన రజినీకాంత్…. ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడడం సిగ్గుచేటు అని మండిపడ్డరు మాజీ మంత్రి కొడాలి నాని. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను…. ప్రజలేవరూ పట్టించుకోరని.. ఎన్టీఆర్ బతికుండగా రజిని ఏం చేశాడు…. ఇప్పుడెం మాట్లాడుతున్నాడని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు మాజీ మంత్రి కొడాలి నాని. మూడు రోజులు షూటింగ్ చేస్తే…. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజిని ,తెలుగు ప్రజలకేం చెప్తాడని నిలదీశారు.

Advertisement

READ ALSO : శ్రీముఖి నడుము చూడడానికి రెడీ అయిపోయిన చిరంజీవి?

ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రజినీకాంత్ చదువుతూ రజినీకాంత్ మరింత దిగజారుతున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇక అటు.. ఆంధ్రప్రదేశ్ కు విచ్చేసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పై బాపట్ల లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా. రజనీకాంత్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడాలి కానీ , చంద్రబాబునాయుడు భజన చేయడానికి వచ్చాడా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు గొప్పవాడు అని చెప్పటం విడ్డూరం… అసెంబ్లీలో కనీసం మైకు కూడా ఇవ్వకుండా ఎన్టీఆర్ ను అవమానపరిచిన చంద్రబాబు నాయుడును రజనీకాంత్ పొగడటం చాలా బాధాకరమన్నారు రోజా.

READ ALSO :  సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

Visitors Are Also Reading