Home » ఆ డ్యాన్స్ మాస్టర్ డైరెక్షన్ లో మెగాస్టార్..!

ఆ డ్యాన్స్ మాస్టర్ డైరెక్షన్ లో మెగాస్టార్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో ఒక్కడు అయిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కాబోతుంది. చిరు గత సినిమా అయిన ఆచార్య ప్లాప్ తర్వాత.. దీనితో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం చిరంజీవి యొక్క మరో రెండు సినిమాలు అనేవి సెట్స్ పైన ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

బోళా శంకర అనే పేరుతో వస్తున్న ఓ సినిమాలో చేస్తున్న చిరు.. వాల్తేరు వీరయ్య అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా కనిపించనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు అనేవి పూర్తి కాకముందే చిరు మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు డైరెక్షన్ టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా డ్యాన్స్ మాస్టర్ గా.. డైరెక్టర్ గా ఎంతో గుర్తింపు అనేది తెచ్చుకున్నా ప్రభుదేవా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక గతంలో ప్రభుదేవాతో శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమా చేసిన చిరు.. ఇన్ని రోజులకు మళ్ళీ ఆయనతో చేయబోతున్నాడు. అయితే ప్రభుదేవా – మెగాస్టార్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఓ రీమేక్ అని తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీలో వచ్చిన ఓ స్పానిష్ థ్రిల్లర్ కథ యొక్క రీమేక్ అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ముంబై జట్టులో ఉంటె సూర్య కెరియర్ నాశనం..!

ఐపీఎల్ కంటే తక్కువగా ప్రపంచ కప్ ప్రైజ్‌మనీ..!

Visitors Are Also Reading