Home » వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోవడానికి లావణ్య త్రిపాఠికి మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ ఏమిటంటే..?

వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోవడానికి లావణ్య త్రిపాఠికి మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ ఏమిటంటే..?

by Mounika
Ad

ఈ జూన్ 9వ తేదీన టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ హైదరాబాద్, మనికొండలో ఉన్న నాగబాబు ఇంట్లో కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయంపై అనేక వార్తలు హల్చల్ చేశాయి. ఎప్పటినుంచో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అవి అవాస్తవాలని, వారి మధ్య ఎటువంటి ప్రేమ లేదని తేల్చి చెప్పేశారు.

Advertisement

వారిద్దరూ మా మధ్య ఎటువంటి సంబంధం లేదని ఎన్ని చెప్పినా కూడా సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక కొంతకాలం తర్వాత వాళ్లపై వస్తున్న వార్తలపై వరుణ్, లావణ్య స్పందించడం కూడా మానేశారు. కానీ ఎట్టకేలకు ఈ వార్తలే నిజమయ్యాయి. ఈ శుక్రవారం జరిగిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఇద్దరు 2017 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన మిస్టర్ సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధానికి దారితీసింది. మిస్టర్ సినిమా తర్వాత అంతరిక్షం సినిమాలో కూడా లావణ్య, వరుణ్ జంటగా నటించారు. అయితే నటించిన ఈ రెండు చిత్రాల స్టోరీ ప్లాప్ అయిన గత 5 సంవత్సరాలుగా కొనసాగుతున్న వీరి లవ్ స్టోరీ మాత్రం హిట్ అయ్యింది.

Advertisement

ఇక వీరిపై ప్రస్తుతం మరో వార్త వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలీ లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోవటానికి కొన్ని షరతులు పెట్టినట్టు.. దానికి లావణ్య అంగీకరిచ్చినట్లు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని షరతు పెట్టగా అందుకు లావణ్య కూడా అంగీకరించిందని.. దానితో మెగా ఫ్యామిలీ వీరిద్దరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆమె చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయనుందట లావణ్య. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అనే విషయం వారికే తెలియాలి. ఇక ఈ ఏడాది చివరలో ఇటలీలో వీరి వివాహం చేసుకోనున్నట్టు తెలుస్తుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Venu Swamy : ఆదిపురుష్ సినిమా అట్టర్ ఫ్లాఫ్ ?

జయలలిత కోసం శోభన్ బాబు ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!

పరిస్థితులు మారాయి.. ఒకప్పుడు ఛీ కొట్టినవాళ్లే.. ఇప్పుడు తిరిగి రమ్మని బతిమాలుతున్నారు..!

 

Visitors Are Also Reading