Home » జయలలిత కోసం శోభన్ బాబు ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!

జయలలిత కోసం శోభన్ బాబు ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!

by Mounika
Ad

తెలుగు చిత్రసీమలో శోభన్ బాబుకు ఉన్న క్రేజ్ ఒక సెపరేట్ ట్రెండ్ ని సెట్ చేసిందని చెప్పవచ్చు.   ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సమయంలోనే తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు శోభన్ బాబు. అప్పట్లో  శోభన్ బాబు చిత్రాలకు మహిళా అభిమానులు బ్రహ్మరథం పట్టేవారు. ఎందుకంటే.. అప్పట్లో శోభన్ బాబు కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించి మెప్పించేవారు.

Shoban babu and jayalalitha

Advertisement

శోభన్ బాబు తన కెరీర్ లో దాదాపు 200 కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 1959లో భక్త శబరి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలలో  ఇద్దరు హీరోయిన్స్ తోనే కలసి చేసిన చిత్రాలే  ఎక్కువగా ఉన్నాయి. దేవత, ఇల్లాలు, కార్తీకదీపం వంటి చిత్రాలలో ఇద్దరు హీరోయిన్స్ తో కథానాయకుడుగా నటించారు. 1973 లో తమ్మారెడ్డి లెనిన్ బాబు దర్శకత్వంలో వచ్చిన డాక్టర్ బాబు అనే చిత్రం ద్వారా శోభన్ బాబు, జయలలిత మొదటిసారిగా కలిసి నటించారు. డాక్టర్ బాబు చిత్రం ద్వారా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది.

Advertisement

వారి పరిచయం కాస్త  మంచి స్నేహంగా మారడంతో ఓసారి మద్రాసులోని తన ఇంటికి శోభన్ బాబుని  డిన్నర్ కి ఆహ్వానించారట జయలలిత. శోభన్ బాబుకి జయలలిత స్వయంగా తన చేతితోనే వడ్డించడంతో.. ఆమె చూపిన ప్రత్యేకమైన అభిమానానికి ముగ్దుడయ్యారట శోభన్ బాబు.  జయలలిత శోభన్ బాబుకు ఫుడ్ వడ్డించే ఈ ఫొటో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా శోభన్ బాబు, జయలలిత కొన్ని చిత్రాలను కలిసి తీసారు.

అప్పటిలో శోభన్ బాబుతో జయలలితకు ఉన్న అనుబంధం గురించి ఎవరూ మరిచిపోలేరు. వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని కొందరు అంటే.. కాదు వారి మధ్య ప్రేమ బంధం సాగిందని మరికొందరు చర్చించుకునేవారు.. అలా అప్పటిలో వీరి స్నేహబంధంపై అనేక వార్త కథనాలు ప్రచారం అయ్యేవి. అంతేకాకుండా వీరి పరిచయం కాస్త సహజీవనానికి దారి తీసిందని.. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా ఓ పాప కూడా ఉందని ఆ కాలంలో వార్తలు విస్తృతంగా ప్రచారం జరిగాయి.  శోభన్ బాబు ఆర్థికంగా ఎంతో బలవంతుడైనా కూడా వ్యక్తిగతంగా, మానసికంగా ఆయనకంటూ కొన్ని పరిమితులు ఏర్పరచుకున్న గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు.

Visitors Are Also Reading