Home » తనను అమ్మోదంటూ యజమానిపై పడి ఏడ్చిన మేక.. వీడియో వైరల్..!!

తనను అమ్మోదంటూ యజమానిపై పడి ఏడ్చిన మేక.. వీడియో వైరల్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు చూస్తే ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోతుంది. ప్రస్తుతం ఈ సంఘటన ప్రతి ఒక్క జంతు ప్రేమికులని కదిలించేలా ఉంది. మూగ జీవాలకు కూడా మనసు ఉంటుందని నిరూపిస్తున్నాయి. సాధారణంగా మన ఇంట్లో ఆవులు, గేదెలు,మేకలు, కుక్కలు, పిల్లులు, కొంతమంది, పక్షులను పెంచుకుంటూ ఉంటారు. వాటిని మనం ఏ విధంగా చూసుకుంటామో దానికి రెట్టింపు అవి మనపై ప్రేమను చూపిస్తూ వుంటాయి. కుక్కను పెంచుకుంటే అది ఎక్కడ ఉన్నా యజమాని జాడను తప్పనిసరిగా పడుతుంది.

Advertisement

కొంతమంది ఈ మూగ జీవాలను చిన్నప్పటి నుంచి పెంచుకొని కొన్ని సందర్భాల్లో వాటిని అమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు అవి ప్రదర్శించే తీరు చూస్తే మనుషుల కన్నా వంద రెట్లు అవి ప్రేమను కలిగి ఉంటాయనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా అలాంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం రోజున బక్రీద్ వేడుక సమయంలో ఈ మేక తన యజమానిపై పడి ఏడ్చే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బక్రీద్ సందర్భంగా తన యజమాని మేకను అమ్మడానికి మార్కెట్ కు తీసుకువచ్చారు.

Advertisement

అనంతరం ఆ మేకను వేరే వ్యక్తికి అమ్మి డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఆ మేక ఒక్క సారిగా తనను పెంచిన యజమానిపై పడి బోరున విలపించింది. మనిషి లాగానే అతని భుజాలపై వాలి మేక ఏడవసాగింది. దాని ఏడుపుతో యజమాని కూడా ఆవేదన చెందుతూ ఏడ్చారు. ఈ ఘటనను అక్కడే ఉన్నటువంటి కొంతమంది వీడియోలో చిత్రీకరించారు. ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు మూగ జీవి యజమానిపై చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading