Telugu News » Blog » పుష్ప -2 సినిమాకి అల్లుఅర్జున్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

పుష్ప -2 సినిమాకి అల్లుఅర్జున్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

by Anji
Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌ల‌లో ఒక‌రైన సుకుమార్ కాంబోలో వ‌చ్చిన పుష్ప సినిమా గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ సినిమా విడుద‌లై 8 నెల‌లు కావ‌స్తున్న ఈ సినిమాకి క్రేజ్ మాత్రం ఇంకా త‌గ్గ‌లేదు. ఎక్క‌డ చూసిన పుష్ప డైలాగ్‌లు, పాట‌లు వినిపిస్తున్నాయి. ఇందులో ఉన్న డైలాగ్‌ల‌కు కేవ‌లం ప్రేక్ష‌కులే కాదు.. ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఫిదా అయ్యారు.  ఈ సినిమా కేవ‌లం భార‌త‌దేశంలోనే కాకుండా  ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.  ఇక పుష్ప‌-2 కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్ మాసం నుంచి ప్రారంభం అవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉండ‌గా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. ఇంత‌లోనే వ‌ర్షాలు అడ్డు రావ‌డంతో షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో ప్రారంభమ‌వ్వ‌నుంది. ఇక‌ 2023 వేస‌విలో ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. పుష్ప సినిమాలో న‌టించిన ప్ర‌ధాన తారాగ‌ణం ఇంద‌లో న‌టించ‌నున్నారు. అయితే కొంద‌రూ నూత‌న‌ న‌టుల‌ను ఇత‌ర పాత్ర‌ల కోసం ఎంపిక చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది చిత్ర‌బృందం. ద‌ర్శ‌కుడు సుకుమార్ కూడా క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు. తాజాగా పుష్ప‌-2 చిత్రానికి సుమారు రూ.350 కోట్ల బ‌డ్జెట్ ఫిక్స్ చేశార‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

Advertisement


పుష్ప‌-2 సినిమాకు ఇటు అల్లు అర్జున్‌, అటు సుకుమార్‌, ఇత‌ర న‌టీన‌టుల‌కు భారీగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా పుష్ప సినిమాకు అల్లు అర్జున్ రూ.45 కోట్లు తీసుకున్నార‌ట‌. పుష్ప – 2 సినిమాకు రూ.100 కోట్లు తీసుకోనున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ద‌ర్శ‌కుడు సుకుమార్ మొద‌టి భాగానికి రూ.18 కోట్లు తీసుకుంటే.. రెండో భాగానికి ఆయ‌న రూ.45 కోట్ల మేర‌కు తీసుకోనున్నార‌ని స‌మాచారం. ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్ల‌కు రూ.75 కోట్ల వ‌ర‌కు ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే సినిమా బ‌డ్జెట్ దాదాపు రూ.350 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు అవుతుంద‌ని అంచనా వేశార‌ట‌. పుష్ప‌-2 సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : 

స‌మంత న‌టించిన శాకుంత‌లం సినిమా అందుకే ఆగిపోయిందా..?

Advertisement

జీవితంపై క‌ళ్యాణ్ దేవ్ ఎమోష‌న‌ల్ పోస్ట్.. ఆ ఉద్దేశంతోనేనా..?