Home » తెలుగు ఇండస్ట్రీలో “100” కోట్ల హీరోలు ఇంతమంది ఉన్నారా..!!

తెలుగు ఇండస్ట్రీలో “100” కోట్ల హీరోలు ఇంతమంది ఉన్నారా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ చాలా ఎత్తుకు ఎదిగింది. ఇందులో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే చాలా మంది హీరోలు వంద కోట్ల పారితోషికానికి చేరే వరకు వచ్చారు. అంటే ఇండస్ట్రీ ఏ లెవల్ లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు హీరోలు 5 కోట్లు 10 కోట్లు తీసుకుంటున్నారు అంటేనే మనందరం షాక్ అయ్యేవాళ్ళం. ఆ తర్వాత 25 కోట్లు 50 కోట్ల వరకు చేరుకున్నారు. ఇప్పుడు ఏకంగా వంద కోట్ల క్లబ్ లో హీరోలు చేరిపోయారు. మొదటిగా సౌత్ ఇండస్ట్రీలో విజయ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే విషయం అందరికి తెలిసిందే.

Advertisement

ఆయన ఇప్పటికే కమిట్ అయినటువంటి సినిమాలు అన్నింటికీ 100 కోట్ల రూపాయల వరకూ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొడితే మాత్రం వాటిలో వాటా కూడా తీసుకుంటున్నారు విజయ్. ఈ విధంగా సౌత్ లో వంద కోట్ల లో చేరిన మొదటి హీరో విజయ్. ఆయనే కాకుండా సౌత్ లో మరికొంత మంది హీరోలు కూడా వంద కోట్లకు పైగా తీసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా మహేష్ బాబు వంద కోట్ల వరకు చేరుకున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రభాస్ 100 కోట్లు దాటి 120 కోట్ల రూపాయలు తీసుకునే విషయం అందరికి తెలిసిందే. ఇక తెలుగు ఇండస్ట్రీలో వంద కోట్లకు దగ్గరగా ఉన్నది పవన్ కళ్యాణ్ మరియు మరో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు.

Advertisement

వీరు 75 కోట్ల నుంచి 85 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని, త్వరలోనే వీరు కూడా వంద కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నిర్మాతలంతా తలలు పట్టుకుంటున్నారు. వంద కోట్ల రూపాయల వసూళ్లు కష్టంగా ఉన్న ఈ సమయంలో 100 కోట్ల పారితోషికం అంటే భయపడిపోతున్నారు. హీరోలు పారితోషికాలు పెంచారని టికెట్ రేట్లు కూడా పెంచేశారు. ఈ విధంగా టికెట్ రేటు పెరగడంతో జనాలు సినిమాలకు రావడమే మానేశారు. ఈ తరుణంలో నిర్మాతలంతా హీరోల పారితోషకం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ALSO READ:

Visitors Are Also Reading