Telugu News » Blog » అన్నదమ్ముల వివాదంపై మంచు మనోజ్ ఏమన్నారో తెలుసా ?

అన్నదమ్ముల వివాదంపై మంచు మనోజ్ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ads

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఇటీవలే భూమా మౌనికరెడ్డిని పెళ్లి చేసుకున్నారు మనోజ్. గత కొద్ది రోజులుగా మంచు బ్రదర్స్ వివాదం జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ ఇటీవలే మంచు విష్ణు గొడవ పడుతున్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఈ వివాదంపై మనోజ్ స్పందించారు. ఓ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన మనోజ్ ని ఈ వివాదం గురించి ప్రశ్నించగా.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  

Advertisement

Also Read :  నాచురల్ స్టార్ నాని ఆ డైరెక్టర్ దగ్గర డ్రైవర్ గా చేశారా..?

Advertisement

“ ఆ వివాదం గురించి నాకంటే ఓ ప్రముఖ ఛానల్ కే బాగా తెలుసు. వాళ్లను అడిగితే చెబుతారు. నేను ఇప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మాకు ఒక సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు మనోజ్.  నేను త్వరలోనే కొత్త ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తున్నాను. వచ్చే నెల మొదటి వారంలో దానికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తాను.  

Also Read :  బాల‌య్య వ‌సుంధ‌రల పెళ్లికి ఎన్టీఆర్, హ‌రికృష్ణ ఎందుకు రాలేదు..? ఎవ్వ‌రికీ తెలియని నిజాలు ఇవే..!

నాకు సినిమాలే జీవితం. ప్రేక్షకులే నా జీవితం. సినిమాలు లేకపోతే నాకేమీ లేదు. నేను మళ్లీ సినిమా ఇండస్ట్రీకే వస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. మంచు విష్ణుకు తనకు మధ్య జరిగిన వివాదంపై మాత్రం మనోజ్ స్పందించడానికి ఇష్టపడలేదు. అన్నదమ్ములను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

Advertisement

Also Read :  శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అదేనా ?

You may also like