నటనా టాలెంట్ ఉండాలి కానీ సినీ బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా కూడా ఇండస్ట్రీలో రాణించవచ్చని కొంతమంది హీరోలను చూస్తే అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో నాని. ఎలాంటి క్యారెక్టర్లు అయినా ఇట్టే దూరిపోయే అద్భుత నటన చాతుర్యం కలిగిన హీరో నాని అని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి సూపర్ హిట్ అందుకొని నేచురల్ స్టార్ గా మంచి గుర్తింపు సాధించాడు. నటన అంటే కేవలం రంగులు పూసుకోవడమే అనే కాకుండా డి గ్లామరస్ పాత్రలు కూడా చేయగలమని నిరూపించాడు నాని.
Advertisement
also read:నిహారిక, చైతన్య మధ్య చిచ్చు పెట్టింది అతనేనా..?
అలాంటి డీ గ్లామరస్ పాత్రలో నటిస్తున్న సినిమా దసరా. త్వరలో ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే నాని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.. దసరా మూవీ తన సినీ జీవితంలోనే బెస్ట్ చిత్రంగా నిలువ బోతోందని అన్నారు.. తను సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని , కొంతమంది డైరెక్టర్లు నన్ను డ్రైవర్ గా కూడా వాడుకున్నారని తెలిపారు. అయినా నేను వెనక్కి తగ్గకుండా డ్రైవర్ గా కూడా చేసి నేను అనుకున్న పనిని సాధించుకున్నానని తెలియజేశారు.
Advertisement
also read:బలగం సినిమా డైరెక్టర్ వేణుకు దిల్ రాజు కారుతో పాటూ అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చాడా..?
ఏదైనా చిన్న రోల్ కోసం వస్తే డ్రైవర్ గా వాడుకొని, రోల్ ఇస్తామని చెప్పి కనీసం ఫోన్ కూడా చేయలేదని అన్నారు. అంతేకాదు నేను ఖర్చులకోసం దాచుకున్న డబ్బును కూడా ఎవరో కొట్టేసారని, ఆ సమయంలో డబ్బు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కష్టాలు వచ్చినా నేను నా ప్రయత్నాలు ఆపలేదని, ఈ క్రమంలోనే ఓసారి అష్టా చమ్మా చిత్రంలో ఛాన్స్ దక్కిందని తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత అనేక అవకాశాలు వచ్చాయని అవి చేస్తూ సక్సెస్ అయ్యానని తెలియజేశారు.
Advertisement
also read:ఉస్తాద్ భగత్ సింగ్ పై పవన్ ఫ్యాన్ ట్వీట్..అలాంటి రిప్లై తో డైరెక్టర్ కౌంటర్ ఎటాక్..!