Telugu News » Blog » శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అదేనా ?

శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అదేనా ?

by Anji
Ads

RRR సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రంలో నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఇవాళ ఈ చిత్రం టైటిల్ రివీల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా  రామ్ చరణ్ కి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

Advertisement

Also Read :  బ‌ల‌గం సినిమా డైరెక్ట‌ర్ వేణుకు దిల్ రాజు కారుతో పాటూ అన్ని కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చాడా..?

రామ్ చరణ్ సూపర్ స్టైలీష్ గా ఉన్నారు. బైకు పై కూర్చొని ఉన్న రామ్ చరణ్ నల్ల కళ్లద్దాలతో స్టైలిష్ హెయిర్ కట్, గడ్డంతో మునుపు ఎన్నడూ లేని కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇది చూస్తుంటే..చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రతీ సినిమా కూడా చాలా గొప్పగా, గ్రాండ్ గా అనిపిస్తుంది. రామ్ చరణ్ మ్యానరిజం, స్టైల్ తో ఈ చిత్రం మరో లెవల్ లో ఉండే అవకాశముంది. మ్యూజికల్ సెన్షేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Advertisement

Also Read :   నాచురల్ స్టార్ నాని ఆ డైరెక్టర్ దగ్గర డ్రైవర్ గా చేశారా..?

ప్రస్తుతం విడుదల చేసిన గ్లింప్స్ లో చెస్ బోర్డు కనిపిస్తుండగా.. అందులో కాయిన్ ఉంటుంది. గ్లింప్స్ ఆధారంగా చూస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్ మంత్రి పాత్రలో నటిస్తున్నారనే విషయం అర్థం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలో రాజకీయ సన్నివేశాలను కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద షూట్ చేశారు. అక్కడి బ్యానర్ లలో రామ్ చరణ్ ఫోటో కూడా ఉంటుంది. మంత్రి పాత్రలో నటిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలో రాజకీయ సన్నివేశాలను కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద షూట్ చేశారు.  అక్కడి బ్యానర్ లలో రామ్ చరణ్ ఫోటో కూడా ఉంటుంది. మంత్రి పాత్రలో రామ్ చరణ్ పోషించబోయే పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని టైటిల్ లోనే చెప్పేశాడు దర్శకుడు శంకర్. 

Advertisement

Also Read :  బాల‌య్య వ‌సుంధ‌రల పెళ్లికి ఎన్టీఆర్, హ‌రికృష్ణ ఎందుకు రాలేదు..? ఎవ్వ‌రికీ తెలియని నిజాలు ఇవే..!

You may also like