Home » పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం

పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం

by Anji

పబ్లిక్ ఎగ్జామినేషన్‌ బిల్లుకు లోక్‌సభ   ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీని తర్వాత ఈ యాంటీ చీటింగ్ బిల్లు  రాజ్యసభకు వెళ్ళనుంది. దాని తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో చట్టంగా మారనుంది. ఈ బిల్లుతో పబ్లిక్ పరీక్షలన్నీ ఇక మీదట కఠినతరంగా మారనున్నాయి. పరీక్సా పత్రాలు లీక్ అయినా..జవాబు పత్రాలను టాపంరింగ్ లాంటివి చేసినా, కాపీ చేసినా కూడా కఠిన శిక్షలు పడనున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రశ్నపత్రం లీక్ కేసులు  లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థుల జీవితాలను అయోమయంలో పడేశాయి. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ చర్యలను అడ్డుకోకపోతే మాత్రం లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకున్నట్లే అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రతిపాదిత బిల్లులో విద్యార్థులను టార్గెట్ చేయబోమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యవస్థీకృత నేరాలు, మాఫియా, ఈ పనుల్లో పాల్గొన్న వ్యక్తులపై చర్య తీసుకునే నిబంధన ఉంది. రిగ్గింగ్ కారణంగా పరీక్ష రద్దు చేసినట్లయితే, పరీక్ష ఖర్చు మొత్తం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు దోషులుగా తేలిన సంస్థలు భరించవలసి ఉంటుంది. బిల్లులో ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. కంప్యూటర్ ద్వారా పరీక్షా ప్రక్రియను మరింత సురక్షితంగా చేసేందుకు ఇది సిఫార్సులను చేస్తుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు కూడా ఈ కేంద్ర చట్టం పరిధిలోకి వస్తాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో ప్రతిభావంతులను రక్షించేందుకు కఠిన వైఖరిని అవలంబించాలని సూచించారు. ప్రతిపాదిత చట్టానికి సంబంధించిన మొత్తం సారాంశం వ్యక్తులు, వ్యవస్థీకృత మాఫియా , పేపర్ లీక్‌లు, పేపర్ సాల్వింగ్, వంచన, కంప్యూటర్ వనరులను హ్యాకింగ్‌లో నిమగ్నమైన సంస్థలపై కఠినంగా వ్యవహరించడం. పేపర్ లీక్ చేసినా, వేరొకరి స్థానంలో పరీక్ష రాసినా, ప్రశ్నాపత్రాన్ని కాపీ కొట్టినా, పరీక్షను వేరే చోట నిర్వహించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించే అవకాశం బిల్లులో ఉంది. పరీక్షా కేంద్రం, . కంప్యూటర్ ఆధారిత కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించే వారికి అవకతవకలు జరిగినట్లు రుజువైతే కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

Visitors Are Also Reading