Telugu News » Blog » రమ్యకృష్ణను అలా చూడగానే ఏడుపొచ్చింది.. ఆరోజు నిద్ర పోలేదు కృష్ణవంశీ కామెంట్స్ వైరల్..!!

రమ్యకృష్ణను అలా చూడగానే ఏడుపొచ్చింది.. ఆరోజు నిద్ర పోలేదు కృష్ణవంశీ కామెంట్స్ వైరల్..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ కృష్ణవంశీ అంటే తెలియని వారు ఉండరు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ బాలకృష్ణ, తదితరులు నటించిన తాజా చిత్రం రంగమార్తాండ. ఇళయరాజా సంగీతం అందించగా కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ మూవీ. చాలా రోజుల విరామం తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాతో వస్తున్నారు. రంగస్థల కళాకారుల జీవితాలు చుట్టూ తిరిగే ఈ కథని పరిచయం చేయబోతున్నారు. మరాఠీలో విజయం సాధించిన నట సామ్రాట్ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఉగాది సందర్భంగా ఈనెల 22న విడుదలవబోతోంది.

Advertisement

also read:ఘట్టమనేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడా…?

ఈ క్రమంలో దర్శకుడు కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రమ్యకృష్ణ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పాత్రను పవర్ఫుల్ గా డిజైన్ చేశానని అన్నారు. ఇంకా ఇంట్లో ఏ నిర్ణయమైన తన భార్య రమ్యకృష్ణ నే తీసుకుంటుందని ఆమె లేని సమయంలో, తను నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఒకవేళ నిర్ణయంలో తప్పుంటే మార్పులు చేర్పులు చేయమని రమ్యకృష్ణ సూచిస్తుందని అన్నారు. కానీ ఈ సినిమాలో రమ్యకృష్ణకు పవర్ఫుల్ కళ్ళు, ఉన్నాయని అరుపులు, కేకలు కాకుండా కళ్ళతో నటించాలని చెప్పగానే సినిమా ఒప్పుకుందని అన్నారు.

Advertisement

also read:సినిమా కోసం 300 ఎకరాలు పోగొట్టుకున్నాను… నాటు నాటు నాకు నచ్చలేదు – కీరవాణి తండ్రి

కానీ ఈ చిత్రంలో తన మేకప్ హెయిర్ స్టైల్ తానే చేసుకుందని ఆమె ఎప్పుడు విజన్ తో ముందుకు వెళ్తుంది అని తెలియజేశారు. ఇక రమ్యకృష్ణ తాను అలా చూసేసరికి ఏడ్చేసానని తెలియజేశారు కృష్ణవంశీ.. రమ్యకృష్ణ ఒక సీన్ లో షూట్ చేసే అంతసేపు తన కళ్ళల్లోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయని, ఆరోజు నిద్ర పట్టలేదని, నిజంగా చెప్పాలంటే గుండెను రాయి చేసుకుని షూటింగ్ చేశానని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

also read:జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!