Home » ఏదో ఒక రోజు సీఎం అవుతా.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్..!

ఏదో ఒక రోజు సీఎం అవుతా.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొందరూ నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరూ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ  అనుచరులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.  నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..నల్గొండ నియోజకవర్గంలో జరిగిన  అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. 2018లో బీఆర్ఎస్ మాయమాటలు చెప్పి గెలిచిందని విమర్శించారు. 

Advertisement

ఏదో ఒక రోజు సీఎం అవుతాను అని తెలిపాడు కోమటిరెడ్డి. అంతలోనే నాకు సీఎం కావాలని లేదనడం గమనార్హం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ జన్మనిచ్చి నల్గొండ నియోజకవర్గాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు మరిచిపోను అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తనకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి.. ఉన్నత స్థానం కల్పించారు. నల్గొండ ప్రజల ఆదరణ చూస్తుంటే చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అంటూ ఎమోషనల్ అయ్యారు వెంకట్ రెడ్డి. మరొకసారి తనను గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. తమ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని తెలిపారు.

Advertisement

ఎన్నికలకు ముందు రైతుబంధు వేస్తారని.. దానిని చూసి మోసపోవద్దని.. ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని.. ఉద్యోగాల భర్తీలో పూర్తిగా విఫలం చెందిందని మండిపడ్డారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వి ప్తి చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా పని చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే.. 01వతేదీనే జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 15వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆ**త్మ*హ**త్యలు చేసుకోవడం చాలా బాధకరం అన్నారు. రైతులు, విద్యార్థులు బతికినప్పుడు చేయని సాయం చనిపోయాక చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 తెలుగు న్యూస్ కోసం వీటిని వీక్షించండి.

Visitors Are Also Reading