Home » చేపల పులుసు వ్యాపారంలో భారీగా పెరిగిన కిర్రాక్ ఆర్పీ ఆదాయం.. కర్రీ రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే..?

చేపల పులుసు వ్యాపారంలో భారీగా పెరిగిన కిర్రాక్ ఆర్పీ ఆదాయం.. కర్రీ రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే..?

Ad

కమెడియన్ గా ఎంతో గుర్తింపు సాధించిన కిర్రాక్ ఆర్పి ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే కాస్త దూసుకెళ్తున్నాడు. నెల్లూరు ట్రేడ్ మార్క్ చేపల పులుసును హైదరాబాద్ కు విస్తరించి ఆయన బిజినెస్ ను మూడు పువ్వులు ఆరు కాయలుగా పెంచేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన చేపల పులుసు కు హైదరాబాదులో ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే అక్కడ మూడు బ్రాంచ్ లు ఓపెన్ చేసిన ఆర్పి మంచి ఆదాయంతో దూసుకుపోతున్నారు. మొదట కూకట్పల్లిలో షాప్ పెట్టాడు.

also read:IPL 2023 : రోహిత్ శర్మను ఛీటింగ్ చేసిన సంజూ !

Advertisement

ఇది బాగా రన్ అవ్వడంతో మణికొండ,, అమీర్పేట్ లో బ్రాంచ్ లు ఓపెన్ చేశాడు. ఆర్పి ఫిష్ కర్రీ దుకాణాల వద్ద వినియోగదారుల తాకిడి పెరుగుతోంది. అంతేకాకుండా స్విగ్గిలో కూడా ఆన్లైన్ డెలివరీ అందుబాటులోకి రావడంతో మరింత మంది ఈ చేపల పులుసు పై మక్కువ చూపిస్తున్నారు. ఇదే రకంగా ఆర్పి కూడా ఏ మాత్రం టేస్టు తగ్గకుండా నెల్లూరు చేపలను తెప్పించి కట్టెల పొయ్యి పై వండించి మంచి టేస్ట్ వచ్చేలా క్వాలిటీ మైంటైన్ చేస్తున్నారు. అక్కడి నుంచి కోరమీను, సన్న చేపలు, రవ్వ చేపలు, చేప తలకాయ వంటివి అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆయనకు ఫుల్ గిరాకీ పెరిగి ఆదాయం కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఆయన షాపుల్లో ధరల విషయానికి వస్తే,

Advertisement

also read:May 1st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

బొమ్మిడాయిల పులుసు 375 రూపాయలు..

చేప తలకాయ పులుసు 200 రూపాయలు.
కోరమీను పులుసు 375 రూపాయలు.

రవ్వ చేపల పులుసు 285 రూపాయలు.

సన్న చేపల పులుసు 250 రూపాయలు.

వైట్ రైస్ 75 రూపాయలు.

రాగిసంకటి 100 రూపాయలు .

ఇలా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో మంచి గుమగుమలాడే చేపల పులుసును కస్టమర్లకు అందిస్తున్నారు ఆర్పి హోటల్ యాజమాన్యం. అంతేకాకుండా ఇంకెవరైనా ఒక కేజీ చేపల పులుసు తీసుకుంటే కవర్లలో కాకుండా కుండలో పెట్టి ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఇస్తామంటున్నాడు.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు

Visitors Are Also Reading