Home » May 1st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 1st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

సెక్రటేరియట్ కు ఉద్యోగులు వెళ్లే గేట్ నుంచి ఎమ్మెల్యేను రావాలని చెప్పారు. దాంతో పోలీసులకు, ఎమ్మెల్యే భద్రతా సిబ్బందికి వాగ్వాదం నెలకొంది. సెక్రటేరియట్ పరిసరాల్లో గందరగోళం నెలకొంది.

Advertisement

ఇవాళ తెలంగాణ సచివాలయానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ఉదయం 11.30గంటలకు సచివాలయానికి రానున్నారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ సచివాలయం వరకూ సిఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహిస్తోంది.

 

 

ఇన్సూరెన్స్ పాలసీల గురించి చెబుతూ కడపకు చెందిన వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. దాంతో ఢిల్లీలోని కాల్ సెంటర్ మూసివేతకు కేంద్రానికి ఫిర్యాదు అందింది.

 

హైదరాబాద్ లో భారీవర్షాలకు మరొకరు బలయ్యారు. జూబ్లీహిల్స్ లో బైక్ అదుపు తప్పింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ వీర స్వామి డివైడర్ ను డీ కొట్టి పడిపోయాడు. విద్యుత్ షాక్ తగలడం తో కన్నుమూశారు.

 

విశాఖ నగరంలో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని… అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచింది.

Advertisement

 

హైదరాబాద్ గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్-టీసీఎస్ వద్ద భారీగా వరదనీరు నిలిచిపోయింది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూకట్ పల్లి బ్రిడ్జి కింద భారీగా నిలిచిన వరద నీరు చేరింది.

 

నేటి నుంచి తిరుపతిలో రాష్ట్ర స్దాయి సీఎం కప్ టోర్నమెంటు ను నిర్వహిస్తున్నారు. సాయంత్రం టోర్నమెంటును మంత్రి ఆర్ కె రోజా ప్రారంభించనున్నారు.

 

కర్నాటక లో ఇవ్వాళ రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. తుముకూరు ,హసన్ , చామరాజ్‌నగర్ లో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలు నిర్వహించనున్నారు. రాహుల్ తో పాటు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు.

 

సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

 

ఇవ్ళల లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 కి అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

నేటితో శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ గరుడ వాహనంపై ఉరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంకు స్వామివారు చేరుకోనున్నారు.

Visitors Are Also Reading