Home » May 17th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 17th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

మెదక్ జిల్లా అల్లాదుర్గం శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత ఓ దూడ పై దాడి చేసి చంపేసింది. దాంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, ఇతర అధికారులు గవర్నర్ కు స్వాగతం పలికారు. భారీ భద్రత మధ్య తమిళ సై భద్రాచలం వెళ్లారు. సారపాల ఐటీసీ గెస్ట్ హౌస్ లో గవర్నర్ కు బస ఏర్పాట్లు చేశారు.

Advertisement

నేడు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ల ఛైర్మన్ల కు పిలుపు అందింది.

ఆర్ 5 జోన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌ర‌గ‌నుంది. R 5 జోన్ అంశాన్ని జస్టిస్ కే ఎం జోసెఫ్ , జస్టిస్ అరుణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారించ‌నుంది. అమ‌రావ‌తి కేసుతో పాటు ఆర్ 5 జోన్ కేసును క‌లిపి విచారించాలని గత విచారణ సందర్భంగా ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.

Advertisement

నేడు విశాఖకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాబోతున్నారు. మూడు రోజులు నగరంలో వివిధ కార్యక్రమాల్లో ఆయ‌న‌ పాల్గొననున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటిస్తున్నారు. ఉదయం 8.50 గం.లకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. సీఎం ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంకు చేరుకుని శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

ఖమ్మంలో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. ఖమ్మం చెరువు బజార్‌లో పిల్లలను ఓ వ్య‌క్తి కిడ్నాప్ చేయ‌బోయాడు. స్థానికులు ప‌ట్టుకుని అతడికి దేహ‌శుద్ది చేశారు.

టీఎస్ఆర్టీసీ ‘ఈ-గ‌రుడ’ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులను మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ప్రారంభించారు. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడమే ‘ఈ-గరుడ’ ముఖ్య ఉద్దేశమ‌ని చెప్పారు.

Visitors Are Also Reading