Home » కార్తీకేయ-2 ఓటీటీలో విడుద‌ల ఎప్పుడంటే..?

కార్తీకేయ-2 ఓటీటీలో విడుద‌ల ఎప్పుడంటే..?

by Anji
Published: Last Updated on
Ad

Karthikeya 2 Ott: Release Date Platform: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన చిత్రం కార్తికేయ 2. (కార్తీకేయ-2 ఓటీటీ)ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది ఈ చిత్రం. టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి వ‌సూళ్ల‌ను సాధించింది.

Karthikeya 2 Ott: Release Date, Platform, Ott Rights

Karthikeya 2 Ott: Release Date, Platform

Karthikeya 2 Ott: Release Date, Platform

కృష్ణుడి కంక‌ణం కోసం ఓ యువ‌కుడు సాగించిన ప్ర‌యాణానికి అడ్వెంచ‌ర‌స్ థ్రిల్లింగ్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. 2014లో తెర‌కెక్కిన కార్తికేయ సినిమాకు రీమెక్‌గా వ‌చ్చింది. కార్తికేయ సినిమా కంటే ఎక్కువ‌గా క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసి దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో కేంద్ర హోంమంత్రి సైతం హీరో నిఖిల్‌ను క‌లిశారు. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన కార్తికేయ-2 ద‌స‌రా రోజున సంద‌డి చేయబోతుంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ జీ5 సంస్థ ద‌క్కించుకుంది. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Advertisement

Also Read :  గండిపేట‌లో అల్లు అర్జున్ కొత్త ప్రాప‌ర్టీ విలువ ఎంతో తెలుసా..?

 

మ‌రోవైపు కార్తీకేయ 2 మూవీ మ‌ల‌యాళంలో సెప్టెంబ‌ర్ 23న థియేట‌ర్ల‌లో విడుద‌లైన విష‌యం తెలిసిందే. అధిక సంఖ్య‌లో థియేట‌ర్లు ల‌భించిన‌ట్టు స‌మాచారం.ఈ సినిమాలో అనుప‌మ్ ఖేర్ శ్రీ‌కృష్ణుడిత‌త్వం గురించి చెప్పే డైలాగ్‌లు ఆడియ‌న్స్ గూస్ బంప్ తెప్పించేలా ఉన్నాయి. ఆ ఒక్క స‌న్నివేశ‌మే ఈ చిత్రాన్ని ఎక్క‌డో కూర్చొబెట్టింది. శ్రీ‌కృష్ణుడిని మించిన ఫిలాస‌ఫ‌ర్‌, డాక్ట‌ర్ సైంటిస్ట్, గైడ్, వ్య‌వ‌సాయ‌దారుడు, యుద్ధ వీరుడు లేడంటూ చెప్పే డైలాగ్‌లు ప్రేక్ష‌కుల‌ను బాగా క‌నెక్ట‌య్యాయి. ఈ సినిమాలో అనుప‌మ్ ఖేర్ శ్రీ‌కృష్ణుడిత‌త్వం గురించి చెప్పే డైలాగ్‌లు ఆడియ‌న్స్ గూస్ బంప్ తెప్పించేలా ఉన్నాయి. ఆ ఒక్క స‌న్నివేశ‌మే ఈ చిత్రాన్ని ఎక్క‌డో కూర్చొబెట్టింది. శ్రీ‌కృష్ణుడిని మించిన ఫిలాస‌ఫ‌ర్‌, డాక్ట‌ర్ సైంటిస్ట్, గైడ్, వ్య‌వ‌సాయ‌దారుడు, యుద్ధ వీరుడు లేడంటూ చెప్పే డైలాగ్‌లు ప్రేక్ష‌కుల‌ను బాగా క‌నెక్ట‌య్యాయి.

Also Read :  లవర్ బాయ్ తరుణ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణం ఎవరు ? అస్సలు నమ్మలేరు ఎవరంటే?

Visitors Are Also Reading