Home » గండిపేట‌లో అల్లు అర్జున్ కొత్త ప్రాప‌ర్టీ విలువ ఎంతో తెలుసా..?

గండిపేట‌లో అల్లు అర్జున్ కొత్త ప్రాప‌ర్టీ విలువ ఎంతో తెలుసా..?

by Anji
Ad

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన పుష్ప సినిమా సంచ‌ల‌న విజ‌యం సృష్టించిన విష‌యం తెలిసిందే. సెలెబ్రిటీల నుంచి ప్రేక్ష‌కుల వ‌ర‌కు అంద‌రూ దేశ‌వ్యాప్తంగా పుష్ప‌రాజ్ వ్య‌వ‌హార శైలిని అంద‌రూ అనుక‌రించ‌డం ప్రారంభించారు. పుష్ప అన్ని భాష‌ల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా పిలిపించుకుంటూ క్ర‌మ‌క్ర‌మంగా ఐకాన్ స్టార్ అయ్యాడు. మెగా కంపౌండ్ హీరోగా ప్ర‌త్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడ‌గ‌ట్టుకున్నాడు. పుష్ప సినిమాతో దేశ విదేశాల్లో ట్రెండ్ సెట్ట‌ర్ గా మారారు.

Also Read : అర్ధరాత్రి 12:ఎన్టీఆర్+ జయలలిత..అమ్మ బాబోయ్ అంత పని చేశారా..?

Advertisement

తాజాగా అల్లు అర్జున్ హైద‌రాబాద్‌లో భారీ ఆస్తిని కొనుగోలు చేసార‌ని టాక్ వినిపిస్తోంది. విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. భార‌త్‌లోని ప‌లు న‌గ‌రాల్లో ఆస్తులు ఉన్నాయ‌ట‌. అల్లు అర్జున్ అల్లు స్టూడియోను ప్రారంభిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని గండిపేట ప్రాంతంలో ఉన్న అల్లు స్టూడియోస్ అల్లు అర‌వింద్ తండ్రి, అల్లు అర్జున్ తాత అల్లు రామ‌లింగ‌య్య‌కి అంకితం చేశారు. 10 ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న ఈ స్టూడియో అక్టోబ‌ర్ 1న అల్లు రామ‌లింగ‌య్య జయంతి సంద‌ర్భంగా భారీ ప్రారంభోత్స‌వానికి సిద్ధం అయింది.

Advertisement

Also Read : రికార్డు సృష్టించిన‌ బాల‌య్య.. చెన్న‌కేశ‌వ‌రెడ్డికి భారీ క‌లెక్ష‌న్లు..!

అల్లు స్టూడియోలో అత్యాధునిక సాంకేతిక, సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉంది. అక్టోబ‌ర్ 1 నుంచి చ‌ల‌న‌చిత్రాలు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, టీవీ షోల చిత్రీక‌ర‌ణ‌కు ఈ స్టూడియోను ప్రారంభించ‌నున్నారు. ఈ సంవ‌త్స‌రం స్టూడియోల పూజా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా.. మ‌రోవైపు పుష్ప ది రూల్ ఎట్ట‌కేల‌కు సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోందంటూ ఓ అప్డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలో అన‌సూయ‌, సునీల్, ఫ‌హాద్ ఫాజిల్ త‌దిత‌ర తార‌గ‌ణ‌మంతా అలాగే కొన‌సాగ‌నున్నారు. పుష్ప ది రూల్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : లవర్ బాయ్ తరుణ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణం ఎవరు ? అస్సలు నమ్మలేరు ఎవరంటే?

Visitors Are Also Reading