Home » లవర్ బాయ్ తరుణ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణం ఎవరు ? అస్సలు నమ్మలేరు ఎవరంటే?

లవర్ బాయ్ తరుణ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణం ఎవరు ? అస్సలు నమ్మలేరు ఎవరంటే?

by AJAY
Ad

సినిమాల్లో ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ వ‌చ్చిన హీరోల కెరీర్ లు ఎక్కువ కాలం నిల‌బ‌డ‌వు అన్న‌ది జ‌గమెరిగిన స‌త్యం. ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా మంది హీరోలు ల‌వర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని ఎక్కువ‌కాలం హీరోగా రాణించ‌లేక‌పోయారు. ఆ లిస్టులో త‌రుణ్ కూడా ఉంటాడు. త‌రుణ్ ఒక‌ప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. త‌రుణ్ హీరోగా న‌టించిన నువ్వేకావాలి సినిమా బ్లాక్ బస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాతో త‌రుణ్ కు అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అంతే కాకుండా త‌రుణ్ హీరోగా న‌టించిన నువ్వేనువ్వే సినిమా మంచి విజ‌యం సాధించింది.

Advertisement

అయితే నువ్వేకావాలి సినిమాత త‌ర‌వాత మాత్రం త‌రుణ్ కు ఆ రేంజ్ హిట్ ప‌డ‌లేద‌నే చెప్పాలి. ఇక త‌రుణ్ చిన్న వ‌య‌సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేశాడు. చాలా సినిమాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించి మెప్పించాడు. త‌రుణ్ త‌ల్లి కూడా ప‌లు చిత్రాల‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా న‌టించారు. అయితే త‌రుణ్ కెరీర్ నాశ‌నం అవ్వ‌డానికి కార‌ణం అత‌డి త‌ల్లే అంటూ కూడా ఇండ‌స్ట్రీలో ఓ రూమ‌ర్ ఉంది.

Advertisement

tharun arthi agarwal

tharun arthi agarwal

దాని పై త‌రుణ్ ఓ ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. తాను న‌టించిన సినిమాల్లో నువ్వేనువ్వే అంటే ఇష్ట‌మ‌ని చెప్పాడు. అంతేకాకుండా నువ్వే కావాలి ట్రెండ్ సెట్ట‌ర్ అని ఆ సినిమాతో పోల్చుకుంటే అంత‌టి హిట్ అవ్వ‌డం సులువుకాద‌ని చెప్పారు. త‌న త‌ల్లితో సినిమా గురించి మాట్లాడ‌తాన‌ని అన్నారు.

క‌థ‌లు చెబుతానని కూడా తెలిపాడు. త‌న త‌ల్లి కేవ‌లం న‌చ్చిందో లేదో చెబుతుంద‌ని కానీ తుది నిర్ణ‌యం మాత్రం త‌న‌దే అని చెప్పాడు. ఇక తాను త‌మిళ్ లో ఓ సినిమా చేయ‌గా మంచి విజ‌యం సాధించిందని కానీ అక్క‌డ ఎక్కువ సినిమాలు చేయాల‌ని అల‌నుకోలేద‌ని చెప్పాడు. తాను హీరో కాక‌పోయి ఉంటే క్రికెట్ లో మంచి లెవ‌ల్ లో ఉండేవాడినని పేర్కొన్నాడు.

ALSO READ : రికార్డు సృష్టించిన‌ బాల‌య్య.. చెన్న‌కేశ‌వ‌రెడ్డికి భారీ క‌లెక్ష‌న్లు..!

Visitors Are Also Reading