Home » “సరిలేరు నీకెవ్వరూ” సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా? అసలీ కథ ఎవరికోసం రాసారంటే?

“సరిలేరు నీకెవ్వరూ” సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా? అసలీ కథ ఎవరికోసం రాసారంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో సరిలేరు నీకెవ్వరూ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే 130 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టి సంక్రాంతి హిట్ గా నిలిచింది ఈ సినిమా. నాన్ రాజమౌళి టాప్ 5 సినిమాలలో ఒకటిగా సరిలేరు నీకెవ్వరూ నిలిచింది. మాములు సినిమాగా విడుదల అయిన ఈ మూవీ టాప్ రేంజ్ లోనే కలెక్షన్స్ సాధించింది.

Advertisement

అయితే ఈ సినిమాని అసలు మహేష్ కోసం రాసుకోలేదట. ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కథ కోసం ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నారట. ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని కథని రాసుకున్నారట. ఒకసారి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ ఆయన భావించారట. ఎన్టీఆర్ ను కలిసి ఈ కథని వినిపించారట. అయితే.. ఎన్టీఆర్ కూడా స్టోరీ నచ్చింది కానీ, ఫ్యూచర్ లో చేద్దాం అన్నారట. అప్పటికే ఆయన ఆర్ ఆర్ ఆర్ కు కమిట్ అయ్యి ఉండడంతో ఈ సినిమాకు వెంటనే డేట్స్ ఇవ్వలేదట.

Advertisement

దాంతో వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. కానీ ఓ రోజు మహేష్ బాబు నుంచి అనిల్ కు ఫోన్ వచ్చింది. కథ ఉంది అన్నారట కదా.. వచ్చి నేరేట్ చేయమని అన్నారట. అయితే.. సరిలేరు నీకెవ్వరూ స్టోరీని మహేష్ బాబుకు వినిపించారట. మహేష్ కు కూడా ఈ కథ నచ్చడంతో వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభించారట. చాలా కాలం తరువాత ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం

టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

Visitors Are Also Reading