Home » టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

by Bunty
Ad

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ వార్నర్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. హైదరాబాద్ జట్టు కారణంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డేవిడ్ వార్నర్…. ఆస్ట్రేలియాలో కంటే ఇండియాలో ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా ఉండి… ఒకసారి ఐపిఎల్ టోర్నీ కూడా అందించాడు డేవిడ్ వార్నర్. అయితే ఓ సీజన్ లో డేవిడ్ వార్నర్ బాగా ఆడక పోవడంతో… అతన్ని వదిలేసుకుంది కావ్య మారన్.

Advertisement

దీంతో… డేవిడ్ వార్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఇక ఇందులో భాగంగానే ఐపిఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా వార్నర్ తన కెరీర్ ను కొనసాగించాడు. ఇక ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు వార్నర్. అయితే ఈ సిరీస్ లో కూడా… వార్నర్ బ్యాటింగ్ లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఆడిన 3 టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ తరుణంలో డేవిడ్ వార్నర్ భార్య క్యాండీ వార్నర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

టెస్ట్ క్రికెట్ ఫార్మా లో డేవిడ్ వార్నర్ ఎరా ముగిసింది… కెరీర్ పూర్తిగా సరదాగా సాగిపోయింది… మా డేవిడ్ వార్నర్ కు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు… డేవిడ్ వార్నర్ భార్య ఆసక్తికర పోస్టు పెట్టింది. అయితే డేవిడ్ వార్నర్ భార్య చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… వార్నర్ త్వరలోనే టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా టెస్ట్ క్రికెట్ లో వార్నర్ రాణించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని కొందరు అంటున్నారు. కాగా ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 107 టెస్టులు ఆడగా 8343 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

మరోసారి ఇండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ !

Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు

Visitors Are Also Reading