కెసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ జిల్లా వైద్యరోగ్య అధికారి కార్యాలయం… ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Advertisement
Read Also : సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?
Ad
మైక్రోబయాలజీ, పాతాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్ లో బీఎస్సీ, ఎంఎస్సీ, పిజి, డిప్లమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ లో సూచించిన విధంగా పని అనుభవం ఉండాలి. వయసు జులై 31, 2023వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Advertisement
read also : Silk Smitha : భరించలేని నరకం.. చనిపోయే ముందు ఉత్తరంలో బాధను బయటపెట్టిన సిల్క్ స్మిత ?..
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో మే 1, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను కింది అడ్రస్ కు పంపించవలసి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్, అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ల వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.27, 300 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
read also : Thati Munjalu: ఎండాకాలంలో తాటి ముంజలు తినడం లేదా..? మీరు చాలా మిస్సవుతున్నారు