Home » Jobs in telangana : సింగరేణిలో జాబ్స్.. పరీక్ష లేదు.. మూడు రోజులే ఇంటర్వ్యూలు..!!

Jobs in telangana : సింగరేణిలో జాబ్స్.. పరీక్ష లేదు.. మూడు రోజులే ఇంటర్వ్యూలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు జాబ్ కోసం ఎదురు చూస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి వారికి కొంత ఊరటనిచ్చే విషయం ఇదే అని చెప్పవచ్చు. సింగరేణి నుంచి జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా ఎగ్జామ్ లేకుండా.. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకున్నారట.. మరి అవేంటో చూద్దామా..? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఈ యొక్క సంస్థ కొత్తగూడెంలో ఉన్నది. ఇందులో పలు ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ఇంటర్వ్యూ కి వచ్చే అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 సంవత్సరాల మించకూడదు మరిన్ని వివరాల కోసం https://scclmines.com/012022/
ఈ వెబ్ సైట్ ను నొక్కండి.. ఇంటర్వ్యూలను ఏప్రిల్ 21,22, 23 న నిర్వహిస్తారు.

Advertisement

Advertisement

ఉద్యోగాల వివరాలు :
ఆర్థో సర్జన్ 05
ఆప్తమాలజీ జిస్ట్ 03
జనరల్ సర్జన్ 05
ఈఎన్టీ సర్జన్ 02
ఫిజిషియన్ 04
గైనకాలజిస్ట్ 07
రేడియాలజిస్ట్ 02
హెల్త్ ఆఫీసర్ 04
పాతాళ జిస్ట్ 01
అనేస్తిటీస్ట్ 06
పీడియాట్రీషియన్ 03
చెస్ట్ ఫిజిషియన్ 02
సైకియాట్రిస్ట్ 01

విద్యార్హతలు:
పై పోస్టులో సంబంధించిన వివిధ విభాగాల్లో పీజీ, డిగ్రీ/ డిఎన్బీ చేసి ఉండాలి. దీంతోపాటుగా స్పెషలైజేషన్ కూడా ఉండాలి.

ఎంపిక చేసే విధానం :-అర్హత కలిగిన వ్యక్తులు నేరుగా ఇంటర్వ్యూకి రావచ్చు.

-వారి యొక్క మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేయండి ఇలా :
1) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..

2) అధికారిక వెబ్సైట్ https://scclmines.com/012022/ సందర్శించాలి.

3) ఆన్లైన్లో దరఖాస్తు ఫారం నింపాలి.

4) దరఖాస్తు ఫామ్ ఎలాంటి తప్పులు లేకుండా నింపాలి.

5) ఈ తేదీల్లోనే ఇంటర్వ్యూకు హాజరు అవ్వాలి.

Visitors Are Also Reading