Home » హైదరాబాద్‌లోని ARCIలో ఉద్యోగాలు..నెలకు రూ.54 వేల జీతం.. వివరాలు ఇవే

హైదరాబాద్‌లోని ARCIలో ఉద్యోగాలు..నెలకు రూ.54 వేల జీతం.. వివరాలు ఇవే

by Bunty
Ad

నిరుద్యోగులకు మరో అదిరిపోయే శుభవార్త అందింది. హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్… 18 రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో బిఎ/ బీటెక్/ లేదా ఎం ఈ, ఎంటెక్, ఎం ఎస్ సి మరియు పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Advertisement

Advertisement

గేటు లేదా యు జి సి నెట్ లేదా నెట్ లో అర్హత సాధించి ఉండాలి. నియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి రెండేళ్ల పని అనుభవం ఉంటే సరిపోతుంది. దరఖాస్తు దారుల వయసు 28 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మార్చి 13వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ లేదా ఎస్టీ లేదా మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. స్క్రీనింగ్/ షార్ట్ లిస్టింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు నెలకు 47 వేల రూపాయల నుంచి…. 54 వేల రూపాయల వరకు జీతం వస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 31 వేల రూపాయలు, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 35,000 విధంగా చెల్లిస్తారు.

read also : మహాశివరాత్రి స్పెషల్‌.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే

Visitors Are Also Reading