Home » జబర్దస్త్ కమెడీయన్ యాదమ్మ రాజు విడాకులు.. కారణం ఏంటంటే..?

జబర్దస్త్ కమెడీయన్ యాదమ్మ రాజు విడాకులు.. కారణం ఏంటంటే..?

by Anji
Published: Last Updated on
Ad

బుల్లితెర కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అమాయకుడిగా కనిపిస్తూ కడుపు ఉబ్బా నవ్వించడంలో యాదమ్మ రాజుకి సాటిరారు ఎవ్వరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం జబర్దస్త్ షో లో సద్దాం టీమ్ లో చేస్తున్నాడు యాదమ్మ రాజు. అతని భార్య స్టెల్లా అందరికీ సుపరిచతమే. ఒక టీవీ ప్రోగ్రామ్ లో తన భార్యను తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇవ్వడంతో వీరిద్దరి ప్రేమాయణం బయటపడింది.  గత ఏడాది ఇద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి  చేసుకున్నారు. స్టెల్లా తన భర్త పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని సైతం రన్ చేస్తోంది. 

Advertisement

ఈవెంట్స్ అంటూ తిరుగుతూ ఈ జంటబాగానే డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాము విడాకులు తీసుకుంటున్నాం అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఇది నిజం మాత్రం కాదు.. ఒక షోలో వీరిద్దరూ ఒక థీమ్ గా ఈ జంట విడిపోతున్నట్టు తెలిపింది. ఒక కామెడీ షోలో ప్రతీవారం ఒక టీమ్ తో కామెడీ చేస్తూ ప్రజలకు దగ్గరవుతుంటారు. ఇక ఈ సారి యాదమ్మ రాజు, స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఆ కామెడీ షోలో చూపించడం జరిగింది. నీతో నా వల్ల కావడం లేదు నాకు విడాకులు కావాలంటూ యాదమ్మ రాజు భార్య స్టెల్లా అడుగుతుంది. 

Advertisement

అంతేకాదు.. ఆ విడాకులను ఓ ఫంక్షన్ లా చేయమని చెప్పడంతో ఆ కామెడీ షో స్టార్ట్ అవుతుంది. ఇదంతా ప్రమోషన్స్ స్టంట్ అయినా కూడా కొత్త జంట విడాకులు తీసుకోవడం ఏమాత్రం బాలేదని ఈ ప్రోమోని చూసిన అభిమానులు అందరూ విమర్శిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఎలాంటి పని చేయడానికి అయినా తెగిస్తారా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ జంట విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ జంట పలు రకాల షోలు, ఈవెంట్లను చేస్తూ బిజీగా ఉన్నారు. దీంతో పాటు యూట్యూబ్ సైతం చేస్తూ ప్రేక్షకులకు చేరవవుతున్నారు. అటు యాదమ్మ రాజు జబర్దస్త్ షోలో చేస్తూ కమెడీయన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పాటు పలు సినిమాలలో సైతం చేస్తున్నాడు యాదమ్మ రాజు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

యాదమ్మ రాజుకి కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ ప్రేమించిన అమ్మాయి ఎవరు..? మరో కొత్త ట్విస్ట్..!

Allu Arjun: AAA మల్టీప్లెక్స్ కాకుండా హైదరాబాద్ లో అల్లు అర్జున్ చేసే ఈ బిజినెస్ ల గురించి తెలుసా?

Visitors Are Also Reading