Home » Allu Arjun: AAA మల్టీప్లెక్స్ కాకుండా హైదరాబాద్ లో అల్లు అర్జున్ చేసే ఈ బిజినెస్ ల గురించి తెలుసా?

Allu Arjun: AAA మల్టీప్లెక్స్ కాకుండా హైదరాబాద్ లో అల్లు అర్జున్ చేసే ఈ బిజినెస్ ల గురించి తెలుసా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంత పెద్ద పొజిషన్ కు చేరుకున్నారో తెలిసిందే. పుష్ప సినిమా సూపర్ హిట్ అవడంతో అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం అల్లు వారి అబ్బాయి పుష్ప సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న కాన్సెప్ట్ ను సినీ ఇండస్ట్రీ వారు బాగా పాటిస్తారన్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేసుకుంటూ.. మరో వైపు బిజినెస్ లు మొదలుపెట్టేసారు.

అల్లు అర్జున్ కూడా రీసెంట్ గా థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ ఏ ఏ మల్టీప్లెక్స్ పేరిట ఈ మధ్యే గ్రాండ్ గా ఓపెన్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇప్పటికే థియేటర్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ స్టార్ట్ చేసిన ఏ ఏ ఏ మల్టీప్లెక్స్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సౌత్ లో ఎల్ఈడి స్క్రీన్ ఉన్న మొట్టమొదటి థియేటర్ అల్లు అర్జున్ దే.

అయితే ఈ థియేటర్ కాకుండా అల్లు అర్జున్ కు వైల్డ్ వింగ్స్ బఫే బిజినెస్ కూడా ఉంది. దీనిని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో స్టార్ట్ చేసారు. ఇది కూడా చాలా బిజీగా ఉండే ఏరియా. ఇక్కడ ఫుడ్ కూడా బాగుండడంతో కస్టమర్లు ఎక్కువే ఉంటారు. ఇది కాకుండా అల్లు అర్జున్ కి అల్లు స్టూడియో బిజినెస్ కూడా ఉంది. అల్లు అర్జున్ తాతగారు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ధం దీనిని స్థాపించారు. ఇవి కాకుండా అల్లు అర్జున్ అల్లు అరవింద్ తో కలిసి ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో అల్లు అర్జున్ కో ఫౌండర్ గా ఉన్నారు. ఇవి కాక అల్లు అర్జున్ కు ఇంకా వ్యాపారాలు ఉన్నాయని సినీ ఇండస్ట్రీ లో టాక్ ఉంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

31 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చిన మహిళ 90 ఏళ్లలో డెలివరీ.. ఆశ్చర్యపోయిన వైద్యులు..!

సూపర్ టైం టేబుల్ ని సెట్ చేసుకున్న ఆరేళ్ల చిన్నవాడు..? చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.

Visitors Are Also Reading