Home » ఆ బకెట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఆ బకెట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

సాధారణంగా ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది ప్రతి చిన్న వస్తువులను కూడా ఆన్లైన్ లోనే కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ , అమెజాన్, పేటీఎం వంటి ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ షాపింగ్ విషయంలో ముందు ఉంటున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో నీటి బకెట్ ధర చూసి వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఆ బకెట్ ధర గురించి అమెజాన్ ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

Advertisement

బాత్రూంలో వాడుకునే సాధారణ నీటి బకెట్ ధరను అమెజాన్ వెబ్ సైట్ లో రూ. 25,999 పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో టాపిక్ గా మారింది. తొలుత ఓ పింకు కలర్ బకెట్ ధర రూ. 35,900 ఉండగా.. అమెజాన్ దానిపై 28 శాతం డిస్కౌంట్ ఇచ్చినట్టు వెల్లడించింది.

Advertisement


దీంతో ఆ బకెట్ ధర రూ. 25,999 కే లభిస్తుందని అమెజాన్ ప్రకటించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రోడక్ట్ కు నో కాస్ట్ ఈఎంఐ ఉండదని అమెజాన్ పేర్కొన్నది. అయితే బకెట్ స్టాక్ లో లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంత ధర పెట్టీ బకెట్ ఎవరు కొంటున్నారు తెలియడం లేదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : 

రేణుదేశాయ్ గురించి ఆ డైరెక్ట‌ర్ ఏమ‌న్నారో తెలుసా..?

భర్త వేధించాడని చనిపోవాలనుకుంది.. చివరికి పోలీస్ గా మారిన ఆమె కథ వింటే కన్నీరు పెడతారు..?

 

Visitors Are Also Reading