ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవల కారణంగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లాలో మామిడికాయ పచ్చడి వద్ద దంపతుల మధ్య వచ్చిన చిన్న గొడవ వల్ల ఓ వివాహిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఒక మహిళ భర్త వేధింపులను తాళలేక చివరికి ఆయనకు విడాకులు ఇచ్చి చనిపోవాలని భావించింది . కానీ తనకున్న కొడుకు కోసం ఓ సారి ఆలోచించి చివరికి పోలీస్ ఆఫీసర్ గా మారి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది ఈ తల్లి. ఆమె ఎవరు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..?పెళ్లి చేసుకున్న భర్త కాలయముడుగా మారి, ప్రతిరోజు వేధింపులకు గురి చేసేవాడు. ఆ ఇబ్బందులను తట్టుకోలేకపోయింది. ఎంతో ఏడ్చింది. చివరికి ఆత్మహత్య శరణ్యమని భావించింది. కానీ ఓ సారి వెనక్కు ఆలోచించి ఏడాది వయసున్న కొడుకు అనాధ అవుతాడని అనుకొని వెనక్కి తగ్గింది ఆమె. కేరళలోని కోజికోడ్ కు చెందిన నవజిసా ఆరేళ్ల క్రితం తన భర్త నుంచి విడిపోయి తన కాళ్ళపై తాను నిలబడేందుకు చదివే ఆయుధమని భావించింది. పూర్తిగా చదివుకే అంకితం అయిపోయింది. కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసింది.
2021లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం అక్కడే సివిల్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తోంది. పరేడ్ అనంతరం తన కొడుకు తో కలిసి సరదాగా గడుపుతున్న వీడియోను కేరళ పోలీసులు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో వివాహం ముఖ్యం కాదని ఉద్యోగమే ముఖ్యమంటున్నారు నవజిసా చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె తెలియజేస్తున్నారు.
Advertisement
Advertisement
Noujisha breaks marriage due to domestic abuse; joins Kerala police https://t.co/wCOWeglNyL #KeralaPolice #DowryHarrassment #DomesticViolence
— Mathrubhumi English (@mathrubhumieng) May 25, 2022
Advertisement
ALSO READ;
త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తారంటే…!
అరెరే.. ఇంత మంచి సినిమాలను బన్నీ రిజెక్ట్ చేశాడా.. కారణమేంటి..?