Home » ఆ ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంటే చాలా అదృష్టం..మీకుందా..?

ఆ ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంటే చాలా అదృష్టం..మీకుందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ పుట్టుమచ్చ అనేది కొన్ని స్థలాల్లో ఉంటే అందంగా కనిపిస్తుంది కానీ మరికొన్ని స్థలాల్లో ఉంటే అది చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. మన శరీరంపై ఏ ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ముక్కుపై :


ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా టాలెంట్. ఆనందంగా జీవిస్తారు. మహిళల విషయంలో చాలా అదృష్టవంతులవుతారు. డబ్బు విషయంలో కోదువ ఉండదు.. అలాగే పెదవిపై పుట్టుమచ్చ ఉంటే అధిక పేదరికం అనుభవిస్తారట. ఏదో చేయాలని ఉన్న చేయలేని పరిస్థితి.

Advertisement

కుడి చేతి పై:

కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి డబ్బుకు కొదువ ఉండదు. జీవితంలో సౌకర్యాలు పొందడమే కాకుండా, సమాజంలో గౌరవం లభిస్తుంది. అన్ని రంగాల్లో ముందుంటారు.

12 కంటే ఎక్కువ మచ్చలు :

మానవ శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే మంచిది కాదట. వారి జీవితంలో మనశ్శాంతి ఉండదని, ఆనందం దూరమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కుడి కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే జీవితంలో గొడవలు వస్తాయని అంటున్నారు.

Advertisement

also read:సినిమాల్లోకి రాకముందు సమంతను చూశారా..ఎంత అల్లరి పిల్లో ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..!

ఎడమ బుగ్గ :

ఎడమ బుగ్గ పై పుట్టుమచ్చ ఉంటే నిరాశ కలుగుతుంది. అదే కుడి బుగ్గ పై పుట్టుమచ్చ ఉంటే సంపన్నులవుతారు. వీరి జీవితంలో సౌకర్యాలు పొందడమే కాకుండా సమాజంలో గౌరవం కూడా లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.

చాతి :

ముఖ్యంగా చాతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు. వీరు ఆర్థికంగా బలంగా ఉంటారట.
ముఖంపై:

ముఖ్యంగా ముఖం మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అది ప్రేమకు గుర్తు. ఏదైనా ఒక సబ్జెక్టుపై విపరీతమైన నాలెడ్జ్ ని పొందుతారట. ముఖ్యంగా ముఖంపై ఎడమవైపు ఉంటే వారు డబ్బును సంపాదిస్తారు. కళ్ల లోపల పుట్టుమచ్చ ఉంటే సెన్సిటివ్ గా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading