Telugu News » Blog » ఈటీవీలో ప్రసారమయ్యే యాంకర్ సుమ అడ్డాకి క్యాష్ కంటే రెమ్యునరేషన్ ఎక్కువా..?

ఈటీవీలో ప్రసారమయ్యే యాంకర్ సుమ అడ్డాకి క్యాష్ కంటే రెమ్యునరేషన్ ఎక్కువా..?

by Anji
Ads

యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె సుదీర్ఘకాలంగా యాంకర్ గా కొనసాగుతున్నారు. ఈటీవీలో ఆమె యాంకరింగ్ చేస్తున్న క్యాష్ షో ఇటీవలే ముగిసింది. అయితే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న క్యాష్ షో కి యాంకర్ సుమ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుంది అంటూ ప్రచారం కొనసాగేది. అయితే గేమ్ షో అయినటువంటి క్యాష్ ప్రేక్షకులకు బోర్ కొట్టిందనే ఉద్దేశంతో మల్లెమాల వారు ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడంతో ఆ స్థానంలో ఏ కార్యక్రమంగా వస్తుందా అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Advertisement

శనివారం నుంచి క్యాష్ కార్యక్రమం ప్లేస్ లో సుమ అడ్డా అనే కార్యక్రమం రాబోతుంది. తొలి ఎపిసోడ్ లో సంతోష్ శోభన్ రాగా.. రెండో ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి సందడి చేశారు. ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా.. కార్యక్రమం కూడా రద్దు కావడంతో క్యాష్, ఆలీతో సరదాగా.. ప్రోగ్రామ్ ల స్థానంలో సుమ అడ్డా షో ప్రారంభమైంది. మంచి రెస్పాన్స్ వస్తుందని అంతా భావిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ టాక్ షో ఒక్కొక్క ఎపిసోడ్ కి దాదాపు లక్షన్నర రూపాయల రెమ్యునరేషన్ ని సుమ తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయం పై అధికారికంగా ఓ క్లారిటీ లేదు. కానీ సుమకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ షోకి సంబంధించి రెమ్యునరేషన్ చాలా తక్కువనే అంటూ కొందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Also Read :  చిరంజీవి ఫ్యాన్ అవ్వ‌డమే శివాజీరాజా కెరీర్ కు శాపంగా మారిందా..? ఎందుకు స్టార్ అవ్వ‌లేక‌పోయారంటే..?

సుమ అడ్డా టాక్ షో మరో లెవెల్ ఉంటుందని అభిమానులతో పాటు ప్రతీ ఒక్కరూ ఎంతో నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం విధితమే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సుమ అడ్డా టాక్ షోలో చిరంజీవి సందడి చేసారు. చాలా మందిని కూడా సుమ తన అడ్డాలో కూర్చొబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన ప్రేక్షకులు భావిస్తున్నారు. టాప్ రేటెడ్ షోల లిస్ట్ లో అడ్డా చేరిపోయే అవకాశాలున్నాయని బుల్లితెర విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Also Read :  Waltair Veerayya Trailer : ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ట్రైలర్‌..అన్నయ్య వస్తే పూనకాలు, అడుగేస్తే అరాచకాలు