Home » చిరంజీవి ఫ్యాన్ అవ్వ‌డమే శివాజీరాజా కెరీర్ కు శాపంగా మారిందా..? ఎందుకు స్టార్ అవ్వ‌లేక‌పోయారంటే..?

చిరంజీవి ఫ్యాన్ అవ్వ‌డమే శివాజీరాజా కెరీర్ కు శాపంగా మారిందా..? ఎందుకు స్టార్ అవ్వ‌లేక‌పోయారంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ లో బిజీగా ఉండే న‌టుల‌లో శివాజీరాజా కూడా ఒక‌రు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించిన శివాజీ రాజా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడు అయ్యాడు. మొద‌టగా క‌ళ్లు అనే సినిమాతో శివాజీరాజా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యాడు. ఒక‌ప్పుడు నెగిటివ్ రోల్స్ న‌టించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర‌వాత పాజిటివ్ పాత్ర‌ల్లోనూ న‌టించాడు. కేవ‌లం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానే కాకుండా శివాజీరాజా హీరోగా కూడా సినిమాలు చేశాడ‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

మొగుడ్స్ పెళ్ళామ్స్ సినిమాలో హీరోగా న‌టించ‌గా ఆ సినిమా మంచివిజ‌యం సాధించింది. అయితే శివాజీ రాజా ప్ర‌స్తుతం పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించ‌డం లేదు కానీ మా ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం ప‌క్కా క‌నిపిస్తాడు. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో శివాజీరాజా ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశాడు. క‌న‌క‌మ‌హాల‌క్ష్మి సినిమాలో ద‌ర్శ‌కుడు వంశీ మొద‌ట త‌న‌ను హీరో అనుకున్నాడ‌ని కానీ త‌ర‌వాత న‌రేష్ ను తీసుకున్నార‌ని చెప్పాడు.

Advertisement

ఇక త‌న‌కు ఎంవీ ర‌ఘు మొద‌ట హీరోగా అవ‌కాశం ఇచ్చాడ‌ని అన్నారు. ఆ సినిమానే మొగుడ్స్ పెళ్లామ్స్ అని తెలిపాడు. అంతే కాకుండా మెగాస్టార్ అభిమానిగా 35 ఏళ్లు సినిమా కెరీర్ లో అవ‌కాశాలు రాలేద‌ని చెప్పారు. అభిమానం ఉంటే మ‌న‌సులో పెట్టుకోవాలి కానీ బ‌య‌ట‌కు చెప్ప‌కూడద‌ని అన్నారు. తాను మెగాస్టార్ అభిమాని అని చెప్ప‌డం వ‌ల్ల వాళ్ల మ‌నిషి అనుకుంటార‌ని మిగితావాళ్లు ప‌ట్టించుకోరని చెప్పాడు.

ఇక మెగాస్టార్ వాళ్ల ఇంట్లో మ‌న‌వాడే క‌దా అని ప‌ట్టించుకోరని దాంతో అటూ ఇటూ కాకుండా పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిరంజీవి ఒక్క సినిమాలో కూడా న‌టించ‌లేద‌ని ఇక‌పై అవ‌కాశం వ‌చ్చినా న‌టించే ఓపిక లేద‌ని అన్నారు. మెగాఫ్యామిలీలో కూడా ఒక్క హీరో సినిమాలోనూ న‌టించ‌లేద‌ని వ్యాక్యానించారు.

ALSO READ: మహేష్ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading