Home » Waltair Veerayya Trailer : ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ట్రైలర్‌..అన్నయ్య వస్తే పూనకాలు, అడుగేస్తే అరాచకాలు

Waltair Veerayya Trailer : ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ట్రైలర్‌..అన్నయ్య వస్తే పూనకాలు, అడుగేస్తే అరాచకాలు

by Bunty

Waltair Veerayya :  మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత కూడా ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి బాబి దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మాస్ మహారాజు రవితేజ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

దాంతో ఈ సినిమా పక్క హిట్ అవుతుందని అభిమానులు కోరికగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ అయిన… పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ తరుణంలోనే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ విషయానికి వస్తే, ట్రైలర్‌ లో మెగాస్టార్ చిరంజీవి మాస్‌ ఎంట్రీ అదుర్స్‌ అని చెప్పాలి.  అటు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ వచ్చినప్పుడు వచ్చే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కేక. అలాగే చిరంజీవి డైలాగ్స్, శృతి హాసన్‌, చిరు మధ్య సీన్స్‌ బాగా వచ్చాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా చాలా అందంగా ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్‌.. సినిమా పై అంచనాలను అమాంతం పెంచేశాయి అని చెప్పాలి.

READ ALSO : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్..ముఖ్యమంత్రి కాలేడు..రాసిపెట్టుకోండి – వేణుస్వామి

Visitors Are Also Reading