Home » మీ ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిందా.. బొప్పాయితో పాటు ఇవి తింటే ఇట్టే పెరిగిపోతాయి..!!

మీ ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిందా.. బొప్పాయితో పాటు ఇవి తింటే ఇట్టే పెరిగిపోతాయి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కాబట్టి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చినప్పుడు సాధారణంగా ప్రతి మనిషిలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది.. ఈ సమయంలో కొంతమందికి ప్లేట్లెట్స్ భారీగా తగ్గి వారు సీరియస్ కండిషన్ లోకి వెళ్లిన సందర్భాలు కూడా ఉంటున్నాయి.. అంతేకాకుండ మరణించిన సందర్భాలు కూడా అనేకం.. అయితే ఈ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు చాలా మంది డాక్టర్లు సజెస్ట్ చేసేది బొప్పాయి తో పాటుగా కొబ్బరి బోండాలు కూడా బాగా తీసుకోవాలి అని అంటారు.. కానీ వీటితో పాటు ఈ ఆహార పదార్థాలు కూడా తింటే ప్లేట్లెట్స్ సంఖ్య తక్కువ సమయంలోనే రెట్టింపవుతుంది.. మరి అవేంటో ఒక సారి చూద్దాం..
గుమ్మడి కాయ :

ALSO READ:ఛార్మి మాత్ర‌మే కాదు.. నిర్మాత‌లుగా మారి కోట్ల‌లో న‌ష్ట‌పోయిన 10 మంది హీరోయిన్లు వీళ్ళే..!

Advertisement

సాధారణంగా మన వంటకాల్లో గుమ్మడికాయను ఎక్కువగా వాడతాం. ఈ గుమ్మడిలో విటమిన్ (ఏ)ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారం ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచడమే కాకుండా వాటి సంఖ్యను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది క్రమపద్ధతిలో తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతుంది. ప్రోటీన్ ఉత్పత్తి అయిందంటే ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పెరిగినట్టే.

Advertisement

క్యారెట్ :

క్యారెట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్స్ పెరగడమే కాకుండా, ఫీవర్ బారిన పడ్డ వారు త్వరగా ఉపశమనం పొందుతారు.
బొప్పాయి :


బొప్పాయి పండు అనేది చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగం.. బొప్పాయి పండు లోనే కాకుండా ఆకుల్లో కూడా ఆరోగ్య లక్షణాలున్నాయి. ఇందులో ఆల్కలాయిడ్స్, ఫ్లవనాయిడ్స్,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల 24 గంటల్లోనే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. దీని ఆకు రసం చేదుగానే ఉన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
గోధుమ గడ్డి :


ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపై అవగాహన పెట్టడంతో గోధుమ గడ్డి గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ గడ్డిలో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ గడ్డిని రసంగా చేసుకొని వడబోసి కాస్త నిమ్మరసంతో కలిపి తాగాలి. దీంతో ప్లేట్లెట్ కౌంట్స్ సులభంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

ALSO READ:లేడీ విల‌న్ బింబిసార ఫైట్‌.. ఆ హీరోయిన్ ఎవ‌రంటే..?

Visitors Are Also Reading