Home » లేడీ విల‌న్ బింబిసార ఫైట్‌.. ఆ హీరోయిన్ ఎవ‌రంటే..?

లేడీ విల‌న్ బింబిసార ఫైట్‌.. ఆ హీరోయిన్ ఎవ‌రంటే..?

by Anji
Ad

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టించిన పిరియాడిక్ ఫిక్ష‌న‌ల్ డ్రామా బింబిసార. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ వ‌షిష్ట మ‌ల్లిడి తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కే హ‌రికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్టు 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఇంత హిట్ అవుతుంద‌ని అస్స‌లు ఎవ్వ‌రూ కూడా ఊహించ‌లేదు. క‌ళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ సినిమా ఆయ‌న కెరీర్ కే ఓ బూస్ట్ ఇచ్చిందనే చెప్ప‌వ‌చ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి :  భర్తతో రమ్యకృష్ణ విడిపోయారా…? డివోర్స్ పై ఓపెన్ అయిన కృష్ణ వంశీ…!

Advertisement


ముఖ్యంగా ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌డంతో అటు ఇటూ అయినా న‌ష్టం త‌ప్ప‌ద‌నుకున్నారు. ఈ సినిమాతో ఎవ్వ‌రూ ఊహించ‌ని విజ‌యం అందుకోవ‌డమే కాదు.. టాలీవుడ్ క‌ష్ట‌కాలంలో ఉన్న స‌మ‌యంలో బింబిసార ఓ ఊపిరి పోసింద‌నే చెప్పాలి. 2022, జులై మాసంలో బాక్సాఫీస్ వ‌ద్ద అంత‌గా హిట్ సినిమాలేవి లేవు. ఇక వ‌రుస ఫ్లాప్ సినిమాల‌తో సంద‌డి లేకుండా పోయింది. అలాంటి స‌మ‌యంలోనే బింబిసార విడుద‌లైంది. అయితే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేశారు. ఇక ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా టాలీవుడ్ స్టార్ హీరోల‌ను సైతం ఆశ్చ‌ర్యపరిచింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ల స‌మ‌యంలో దీనికి సీక్వెల ఉంటుంద‌ని క‌ళ్యాణ్‌రామ్ చెప్పారు. అన్న‌ట్టుగానే ఈ చిత్రానికి సీక్వెల్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుతున్నాయ‌ట‌.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  ఛార్మి మాత్ర‌మే కాదు.. నిర్మాత‌లుగా మారి కోట్ల‌లో న‌ష్ట‌పోయిన 10 మంది హీరోయిన్లు వీళ్ళే..!

అక్టోబ‌ర్‌లో సినిమా సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర వార్త అందుతుంది. పార్ట్‌-2లో విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా పాత్ర‌లను మ‌ల‌చాలని అనుకుంటున్నార‌ట‌. ఈసారి క‌ళ్యాణ్ రామ్ లేడీ విల‌న్‌తో ఫైట్ చేయ‌బోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సినిమాల్లో లేడీ విల‌న్ ఉంటే మ‌స్త్ మ‌జా ఉంటుంద‌ని ఆడియెన్స్ కూడా భావిస్తున్నార‌ట‌. ఇక ఈ లేడీ విల‌న్ కోసం ఎవ‌రినీ తీసుకోవాల‌ని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఈ సినిమాలో రాక్ష‌సి పాత్ర ఉంద‌ని.. ఆ సినిమాకు కీల‌క‌మ‌ని అందుకే హీరోయిన్ల ఎంపిక విష‌యం ఆచితూచి నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ట‌. ఈ రాక్ష‌సి పాత్ర కోసం ఎవ‌రినీ తీసుకోబోతున్నారనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.ఇక బింబిసార 2 కూడా బింబిసార మాదిరిగా హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి మ‌రి.

ఇవి కూడా చ‌ద‌వండి :   V V Vinayak : చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా విష‌యంలో ఆ త‌ప్పు చేయ‌క‌పోయి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది..! 

Visitors Are Also Reading